WhatsApp : ఇకపై వాట్సాప్‌లో ఫోటోస్, వీడియోలు ఆఫ్‌లైన్‌లోనూ సెండ్ చేయొచ్చు..!

వాట్సాప్ యూజర్లు ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకునేలా కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా WABetainfo ప్రకారం, నెట్ లేకుండా ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

New Update
WhatsApp : ఇకపై వాట్సాప్‌లో ఫోటోస్, వీడియోలు ఆఫ్‌లైన్‌లోనూ సెండ్ చేయొచ్చు..!

WhatsApp Features : ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp). మెటా(Meta) ఆధ్వర్యంలో ఉన్న ఈ యాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ తమ సబ్ స్క్రైబర్లను మరింత పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా వాట్సాప్ మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్, వీడియోలు ఆఫ్‌లైన్‌(Offline) లో ఈజీగా షేర్ చేయొచ్చు. దీని కోసం డేటా వినియోగించాల్సిన అవసరం లేదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Webetainfo ప్రకారం ఆఫ్‌లైన్‌లో షేర్ చేయబడిన ఫైల్స్ పూర్తిగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని కూడా తెలుసు. అంటే సెక్యూరిటీ పరంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇతరులు వీటిని తెలుసుకోలేరు. యూజర్ల నమ్మకం నిలబెట్టుకోవడానికి ఎన్‌క్రిప్ట్ చేయడం చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది.ఈ ఫీచర్‌కి సంబంధించి ఇటీవలే ఓ స్క్రీన్‌షాట్ లీక్ అయ్యింది. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. Webetainfo నివేదిక ప్రకారం, ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ నుంచి ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే.. మీ డివైజెస్ దగ్గర్లోనే ఉండాలి. అంతేకాదు ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను ఆన్ చేసి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫైల్ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది.

Also Read : ఇండియాలో ఏఐ వాట్సాప్..ఎలా వాడాలో తెలుసా..

వాట్సాప్ ఆఫ్‌లైన్ ఫైల్స్ షేరింగ్ కోసం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. కేవలం బ్లూటూత్ ద్వారా ఫైల్స్‌ను స్కాన్ చేసి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు ఆన్ చేసి.. అవసరం లేదనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్ వాడటం ద్వారా వాట్సాప్ సిస్టమ్ పని చేస్తుంది.మీ ఫోన్ గ్యాలరీ, ఫైల్స్, వీడియోస్, డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయడానికి వాట్సాప్‌ని అనుమతించాలి. లేదంటే ఈ ఫీచర్ పని చేయదు. అయితే యూజర్ నెంబర్‌ను గోప్యంగా ఉంచుతామని, షేర్ చేసిన ఫైల్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేస్తామని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ Shareit యాప్ మాదిరిగా పని చేస్తుంది. ప్రస్తుతం వీటి వాడకం తగ్గింది. నెట్ కనెక్షన్ లేదా వైఫై లేకపోయినా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ సెండ్ చేసుకోవచ్చు. ఇది యూజర్లకు ఎక్కువ టైమ్, డేటాను సేవ్ చేస్తుంది.

ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం స్పష్టంగా తెలియదు. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. బీటా వర్షన్‌లో పరీక్షించబడుతుంది. త్వరలోనే అన్ని డివైజ్‌లకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ ఫీచర్ వచ్చిన తర్వాత, దీని ప్రయోజనాలు పొందడానికి కచ్చితంగా లేటెస్ట్ వర్షన్‌కి అప్‌డేట్ చేయాలి.

Advertisment
తాజా కథనాలు