WhatsApp: వాట్సాప్‌లో కీలక మార్పులు చేసిన మెటా

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజ్ దిగ్గజం వాట్సాప్‌ కీలక మార్పులు చేసింది. తన బ్యాగేజీ కలర్‌ ను ఛేంజ్‌ చేసింది. వాట్సాప్‌ ఛానెల్‌, బిజినెస్‌ అకౌంట్‌ వెరిఫికేషన్‌ టిక్‌ కలర్‌ ఇప్పటి వరకు గ్రీన్‌ లో ఉండగా..దాన్ని బ్లూ కలర్ లోకి మారుస్తూ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

New Update
WhatsApp: వాట్సాప్‌లో కీలక మార్పులు చేసిన మెటా

WhatsApp New Update: ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజ్ దిగ్గజం వాట్సాప్‌ కీలక మార్పులు చేసింది. తన బ్యాగేజీ కలర్‌ ను ఛేంజ్‌ చేసింది. వాట్సాప్‌ ఛానెల్‌, బిజినెస్‌ అకౌంట్‌ వెరిఫికేషన్‌ టిక్‌ (Whatsapp Verified Tick) కలర్‌ ఇప్పటి వరకు గ్రీన్‌ లో ఉండగా..దాన్ని బ్లూ కలర్ లోకి (Blue Color) మారుస్తూ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో మెటా యాజమాన్యంలో ఉన్న ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ అన్ని అకౌంట్లకు సంబంధించిన వెరిఫికేషన్‌ టిక్‌ మార్క్‌ ఇక బ్లూ కలర్‌లోనే కనిపించబోతున్నాయి.

వాట్సాప్‌ ట్రాకర్‌ వాబీటాఇన్ఫో సమాచారం అందించింది. ఇప్పటికే ఆండ్రాయిల్‌లో అందుబాటులో ఉంది. మెటా ఏఐ కోసం వాట్సాప్‌లో త్వరలోనే కంపెనీ బిగ్‌ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఆ తర్వాత మెటా ఏఐ వాయిస్‌ చాట్‌తో కూడా పని చేయబోతుంది. వినియోగదారులు వాయిస్‌ ద్వారా మెటా ఏఐకి ప్రశ్నలు వస్తే.. టెక్ట్స్‌ రూపంలో సమాధానాలు ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులందా నేరుగా యాప్‌లోనే యాక్సెస్‌ చేసుకునే వీలుంది.

ఇదిలా ఉండగా.. వాట్సాప్‌ త్వరలోనే పలు ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేయబోతుంది. ఇందులో ఏఆర్ వీడియో కాలింగ్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్, ఏఐ స్టూడియో, యూజర్ నేమ్స్, డబుల్ ట్యాప్ టు రియాక్ట్ ఫీచర్స్‌ను తీసుకురాబోతుంది. ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) వీడియో కాలింగ్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

వీడియో లుక్‌లో కరెక్షన్స్, ఫేషియల్ ఫిల్టర్స్ వాడుకునే అవకాశం ఉంటుంది.ఈ ఫీచర్ సాయంతో వీడియో వెనుక బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకునే వీలుని కూడా సంస్థ కల్పిస్తుంది. ఇకపై మొబైల్‌ నంబర్‌తో పని లేకుండా యూజర్‌ నేమ్స్‌తో అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకునేలా ఫీచర్స్‌ పరిచయం చేయనుంది. అలాగే, ఏఐ స్టూడియో ఫీచర్‌పై పని చేస్తుంది. మెటా ఏఐ ఛాట్ బాట్‌ను మరింత అప్‌డేట్ చేస్తూ వాట్సాప్ ఈ ఫీచర్‌‌ను ప్రవేశపెట్టబోతుంది.

Also Read: నోనోనో.. అది ఓ పీడకల అయితే బాగుండు.. !

Advertisment
తాజా కథనాలు