Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్...వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. రీసెంట్ గా చాట్ లాక్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకువచ్చింది.

Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్...వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్
New Update

Whatsapp New Feature: వాట్సాప్ యూజర్స్ కోసం తరుచుగా కొత్త ఫీచర్స్ ను తీసుకొస్తూనే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇది టాప్ పొజిషన్ లో ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ లేకుండా ఏ పనీ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లో పాతుకుపోయిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రీసెంట్ గా వాయిస్ నోట్స్ ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసింది వాట్సాప్. ఇప్పుడు తానికి వ్యూ వన్స్ అనే మరో కొత్త ఫీచర్ ను జత చేసింది. దీనితో యూజర్ ఒక్కసారి ఏదైనా వాయిన్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్ గా పోతుంది.

Also Read: గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ

ఇంతకు ముందే ఫోటోలకు వ్యూ వన్స్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఇప్పుడు వాయిస్ మెసేజ్ (Voice Message) లకు కూడా దాన్ని యాడ్ చేసింది. దీంతో మనం ఇతరులకు పంపిన వాయిస్ నోట్ మరొకరికి ఫార్వార్డ్ చేస్తారని ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదు. వాయిస్ నోట్ పంపే ముందే వ్యూ వన్స్ ఫీచర్ ఆన్ చేసి వాయిస్ నోట్ ని పంపొచ్చు. సో పంపిన వెంటనే వాయిస్ మెసేజ్ ఇద్దరికీ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది.

ఈ కొత్త వ్యూ వన్స్ వాయిస్ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ అన్నింటిలోనూ ఇది పని చేస్తుంది. ఇప్పుడు వ్యూ వన్స్ మోడ్ ద్వారా ఫోటోలు, వీడియోలతో పాటూ వాట్సాప్ అన్ని మెసేజ్ లు, వాయిన్ మెసేజ్ లూ...కాల్ ల కోసం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను అందిస్తోంది.

#whatsapp #whatsapp-new-feature #voice-message
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe