WhatsApp: వాట్సాప్ ఇండియాకు గుడ్ బై చెప్పనుందా?: పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

వాట్సాప్ గానీ, వాట్సాప్ మాతృ సంస్థ మెటా గానీ భారత్ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. అలాంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వానికి వాట్సాప్ యాజమాన్యం ఇప్పటివరకూ తెలియజేయలేదని స్పష్టం చేశారు.

WhatsApp: వాట్సాప్ ఇండియాకు గుడ్ బై చెప్పనుందా?: పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
New Update

Whatsapp: వాట్సాప్ గానీ, వాట్సాప్ మాతృ సంస్థ మెటా గానీ భారత్ నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. అలాంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వానికి వాట్సాప్ యాజమాన్యం ఇప్పటివరకూ తెలియజేయలేదని స్పష్టం చేశారు.

యూజర్ల వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల వల్ల భారత్ లో తమ సేవలను నిలిపివేయాలని వాట్సాప్ నిర్ణయించుకుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుందని, ఆ వార్తల గురించి వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తన్ఖా కేంద్రాన్ని కోరారు. ఆయన ప్రశ్నకు సమాధానంగా సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం తెలిపారు.

2024 ఆరంభంలో ప్రభుత్వ మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరిస్థితులు మున్ముందు ఇలానే ఉంటే తమ సేవలను భారత్లో నిలిపివేస్తామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన టెక్ కంపెనీలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల కార్యకలాపాలపై భారత ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకూ మొత్తం 70,612 కంటెంట్ టేక్-- డౌన్ రిక్వెస్ట్లు మెటా సంస్థకు భారత ప్రభుత్వం పంపింది.

ఇందులో.. 63,586 లీగల్ ప్రాసెస్ రిక్వెస్ట్లు కాగా మిగిలినవి అత్యవసరంగా తక్షణమే తొలగించాల్సిన కంటెంట్ కావడం గమనార్హం. వాట్సాప్ సేవలను భారత్ లో 400 మిలియన్ల యూజర్లకు పైగా వినియోగించుకుంటున్నట్లు సమాచారం.

Also read: దాడులకు పాల్పడేది ఉగ్రవాదులు కాదు..పాక్‌ సైన్యమే!

#whatsapp #bharat #aswin-vaishnav #meta
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe