Eggs-Vegetables Benefits: గుడ్లు..ఆకుకూరలు కలిపి తింటే ఏ సమస్యలు వస్తాయి..?

మన శరీరానికి మంచి ఆహారం తీసుకోవటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మనం ఏం ఫుడ్‌ తింటామో అదే మన చర్మంపై ప్రభావం చూపుతుంది. విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే చిలగడ దుంప, టమాటా, క్యారట్లు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, గుమ్మడికాయ వంటి ఆహారం చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

New Update
Eggs-Vegetables Benefits: గుడ్లు..ఆకుకూరలు కలిపి తింటే ఏ సమస్యలు వస్తాయి..?

Eggs-Vegetables Benefits: మన శరీరానికి మంచి ఆహారం తీసుకోవటం ఎంతో ముఖ్యమని వైద్యులు అంటారు. ఎందుకంటే మనం ఏం ఫుడ్‌ తింటామో అదే మన చర్మంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం కోసం ఎన్ని ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ప్రతీ రోజూ సరైన ఆహారం తినకపోతే అది వ్యర్థం అవుతుంది. బ్యాలెన్స్‌ డైట్‌లో విటమిన్‌ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్లలో ప్రధానంగా విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే ఆహారం చర్మ సంరక్షణకు ఎంతగా ఉపయోగపడుతుంది. అయితే.. విటమిన్‌-ఎ అధికంగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందో అవి తీసుకుంటే ఏం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

  • చిలగడ దుంప: చిలగడ దుంపలో విటమిన్‌-ఏ ఎక్కువగా ఉన్నాయి. ఇటినీ రోజూ ఉడకబెట్టి తిన్నా, ఇతర పిండివంటలు, సూప్స్, సలాడ్స్‌ వంటి చేసుకుని తింటే బాగుంటాయి, మంచి చిరుతిండి, ఆరోగ్యానికి చాలా మంచిది.
  • టమాటా: టమాటాల్లో విటమిన్‌ -ఎ పుష్కలంగా ఉంటుంది. మనరోజువారీ వంటకాల్లో టమాటా ఎక్కువగా వాడుతాం. వంటలతోపాటు టమాటా సూప్‌, టమాటా చట్నీ తిన్నా శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్‌ ఏ కాన్సర్‌ సెల్స్‌ పెరగకుండా అడ్డుకుంటుంది.
  • క్యారట్లు: విటమిన్‌-ఎకి క్యారట్లు బెస్ట్‌ ఛాయిస్‌. రోజూ కప్పు క్యారెట్ ముక్కలు తింటే శరీరానికి అవసరమైన 334 శాతం విటమన్‌ అందుతుంది. అయితే క్యారట్స్‌ని వండుకొని కాకుండా పచ్చివి తిన్నా, జ్యూస్‌ తాగినా పోషకాలు సంపూర్తిగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఆకుకూరలు: ఆకుకూరల్లో విటమన్‌ -ఎ అధికం. కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని తక్కువ వండితే అంత ఎక్కువ లాభాలు. ప్రతిరోజూ వీటిని తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
  • పాలు: పాలల్లో కాల్షియమే కాదు విటమిన్‌- ఏ ఉంటుంది. ప్రతిరోజూ గ్లాసెడు పాలు తాగితే స్కిన్‌టోన్‌ ఇంప్రూవ్‌ అవుతుంది.
  • గుడ్లు: గుడ్లలో విటమిన్‌-డి, ఎ ఉన్నాయి. ఈ రెండు రోజూ తింటే చర్మ ఆరోగ్యంతో పాటు అందం మెరుగవుతుంది.
  • గుమ్మడికాయ: గుమ్మడికాయలో కెరోటినాయిడ్‌, ఆల్ఫా-కెరోటిన్‌లు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి కాయలతో సూప్స్, పైస్, స్నాక్స్‌ వంటివి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుమ్మడి గింజలను ప్రతిరోజూ తింటే హార్మోనల్‌ బ్యాలెన్స్‌కి ఎంతో ఉపయోగపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కొన్ని ఆహారాల్లో నిమ్మరసం కలపొద్దంటున్న వైద్యులు..కారణం ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు