Maghamasam: మాఘమాసం విశిష్ఠత ఏంటి?..నదీ స్నానం ఎందుకు చేయాలి? మాఘమాసంలో నదీస్నానం చేసి..శ్రీమన్నారాయణుని పూజించాలి. శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం ఉంటుంది.ఈ మాసంలో నీళ్లలో నువ్వులు వేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి, తులసి మొక్కను నిష్టగా పూజించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Maghamasam: హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీస్నానం చేసి..శ్రీమన్నారాయణుని పూజించాలి. శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం ఉంటుంది. చంద్రుడు మఖనక్షత్రంతో కూడుకున్న మాసం కావునా ఇది మాఘమాసమైయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రథమైనదగా భావిస్తారు. ఈ మాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుందని పండుతులు చెబుతున్నారు. అయితే హింధుమతలో మాఘమాసాన్ని పవిత్రమైనదిగా పాటిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. మాఘమాసంలో చేసే పూజలకు, నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో నీళ్లలో నువ్వులు వేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి, తులసి మొక్కను నిష్టగా పూజించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అన్నింటికన్నా హిందూమతం ప్రాచీనమైనది. ఈ ధర్మాన్ని పాటించే వారు మూడవ స్థానంలో ఉన్నారని చెబుతున్నారు. మాఘమాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మాఘమాసం ప్రాముఖ్యత ఇదే: హింధూవులు మాఘమాసంలో గంగాస్నానం చేసి శ్రీకృష్ణుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసంలో శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. స్వర్గప్రాప్తి లభిస్తుంది: పురాణల్లో మాఘమానాకి ఓ ప్రత్యేకమైన కథ ఉంది. ఇది మాఘమాపం ప్రారంభంలో పురాతన కాలంలో శుభవ్రత్ అనే బ్రాహ్మణుడు చాలా జ్ఞానవంతుడు. ఆయనకు విద్యతో పాటు ధనంపై మక్కువ ఎక్కువగా ఉండటం వలన తన జీవితమంతా డబ్బు సంపాదనలోనే గడిపాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నంత వరకు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ఏదైనా..అనారోగ్యం సమస్యలు వస్తే.. డబ్బు గురించి ఆలోచించడం మానేసి దేవుడిని సేవలపైఎక్కువ దృష్టి పెడతారు. పుణ్యం లభిస్తుంది: అయితే కొన్ని రోజుల తరువాత.. మాఘమాసంలో భగవంతుని నామాన్ని జపిస్తారో వారు స్వర్గానికి చేరుకుంటారని బ్రాహ్మణ శుభవ్రత్ తెలుసుకున్నాడు. వీటితోపాటు మాఘమాసంలో దానధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని తెలుసుకున్నారు. ఆ బ్రాహ్మణుడు తన జీవితపు చివరి రోజుల్లో మాఘమాసానికి ఉన్న ప్రాముఖ్యతను చదివి ఎంతో ఆనందించాడు. ఆ తరువాత మాఘమాసం మొదలు కావడంతో ఆ రోజుల్లో దానధర్మాలు చేసి, నదీ స్నానం చేశాడు. మాఘమాసం రోజులలోనే బ్రాహ్మణుడు శివైక్యం అయ్యాడు. మాఘమాసంలో స్నానం, దానం చేస్తే స్వర్గప్రాప్తిని పొందాడని పురాణలు చెబుతున్నాయి. అప్పటి నుంచి మాఘమాసంలో స్నానం, దానం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇది కూడా చదవండి: మీ నుదుటిపై ఈ రేఖలు ఉన్నాయా..అయితే తిరుగుండదు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #helath-tips #river-bath #maghamasam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి