Ganapathi Puja: ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజైనా వినాయక చవితి భారతీయుల ముఖ్య పండుగలలో ఒకటి. భాద్రపదమాసం శుక్లచతుర్థి సమయంలో చవితి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. వినాయకచవితి రోజూ గణపతిని పూజించడానికి వినాయక పత్రాలే ప్రధానమైనవిగా చెబుతారు. 21 రకాల పత్రాలతో విఘ్నేశ్వరుని పూజించడం పూర్వ నుంచి ఆనవాయితీగా వస్తుంది. వీటిలో విష్ణువుకు, శివునికి, పార్వతితల్లికు ప్రీతికరమైనవి కొన్ని వున్నాయి. ఈ పత్రాల్లో ఔషధ, విషపు మొక్కలు, మధుర ఫలాలు, ముళ్ళవి, వృక్షాలు, చిన్న గుల్మాలు వున్నాయి. అయితే వీటి లక్షణాలను విశ్లేషిస్తే వేదాంతము తెలుస్తుందట.
ఆ 21 పత్రాలు ఏమిటి.. వాటితో గణపతిని ఎలా పూజించాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, జాజీపత్రం, గండకీపత్రం, దూర్వాయుగ్మం, అపామార్గపత్రం, వటపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దాడిమీపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రం, సింధువారపత్రం, దుత్తూరపత్రం, బదరీపత్రం,శమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం 21 రకాల ఆకులతో గజముఖుడైన విఘ్నేశ్వరుని పూజించడం ఆనవాయితీ.
అయితే ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటాయి. అయితే ఈ పత్రాలన్నీ చెట్టు నుంచి తెచ్చిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఈ ఆకుల్లో ఆల్కలాయిడ్స్ ఉంటుంది. ఇవి నీటిలో కల్వడం వలన చెడు పదార్థాలు, క్రియులను నాశనం చేస్తుంది. ఆ నీటిలో ప్రాణవాయుడు శాతం పెరుగుతుంది. ఈ పత్రాల నుంచి వచ్చే సుగంధాన్ని పీల్చడం, ముట్టుకోవటం వలన రోగాలు రావు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకు విజ్ఞానం, వినోదం అన్ని కలుగుతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.