Rave Party : రేవ్ పార్టీకి సినిమా వాళ్లను ఎందుకు పిలుస్తారో తెలుసా?

హ‌ద్దుల్లేని శృంగారం,పీకల్లోతు వరకు తాగిన మైకం.. అదో గమ్మతు లోకం.. రేవ్‌ పార్టీల గురించి అడిగితే చెప్పే సమాధానాలు ఇవే. అసలు కెరీర్‌ను, ఆరోగ్యాన్ని రిస్క్‌ చేసి మరీ సినీనటులు ఎందుకీ పార్టీలకు వెళ్తారు? నిర్వహకులు వారిని ఎందుకు ఇన్‌వైట్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

New Update
Rave Party : రేవ్ పార్టీకి సినిమా వాళ్లను ఎందుకు పిలుస్తారో తెలుసా?

Interesting Facts Linked With Celebrities And Rave Party : హ‌ద్దుల్లేని శృంగారం.. పీకల్లోతు వరకు తాగిన మైకం.. అదో గమ్మతు లోకం.. రేవ్‌ పార్టీల గురించి బడాబాబులను అడిగితే చెప్పే సమాధానాలు ఇవే. ఈ రేవ్‌ పార్టీలు (Rave Party) నిర్వహించేది చాలా పెద్ద తలకాయలే అని చెప్పడానికి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే సినీలోకం ఈ రేవ్‌ పార్టీలకు ఎందుకు దాసోహం అవుతుందన్న ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. తమ కెరీర్‌ను, ఆరోగ్యాన్ని రిస్క్‌ చేసి మరీ సినీనటులు ఎందుకీ పార్టీలకు వెళ్తారు? వారిని ప్రత్యేకంగా నిర్వహకులు ఎందుకు ఇన్‌వైట్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం!

publive-image

ఇండియన్‌ సెలబ్రిటీలు (Indian Celebrities) ఎక్కువగా డ్రగ్స్ (Drugs) ఉపయోగిస్తారనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంటుంది. అధిక ఒత్తిడి వాతావరణంలో పని చేయడం కారణంగా సెలబ్రిటీలు డ్రగ్స్‌ వైపు మళ్లుతున్నట్టుగా నిపుణులు చెబుతుంటారు. సినీ పరిశ్రమ (Cine Industry) ఎక్కువగా అర్థరాత్రి వేళ పార్టీలు చేసుకుంటు ఉంటుంది. ఆ సమయంలో మాదకద్రవ్యాలు మరింత అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇటు సెలబ్రిటీలు తరచుగా విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు. డ్రగ్స్‌ వినియోగం నార్మలైజ్‌గా ఉన్న దేశాలు కూడా ఇందులో ఉంటాయి. మానసిక ఒత్తిడి (Mental Stress) పెరిగిన ప్రతీసారి డ్రగ్స్‌తో ఉపశమనం పొందవచ్చని భావించే సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగా ఉంటుందంటారు నిపుణులు. అయితే ఇలా ఒత్తిడి తగ్గించేందుకు డ్రగ్స్‌ ఉపయోగపడతాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కుండబద్దలు కొడుతున్నారు. ఇదంతా తాత్కాలిక ఉపశమనమే కానీ.. లాంగ్‌ టర్మ్‌లో మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేస్తున్నారు.

వాస్తవానికి ఇండియాలో డ్రగ్స్‌ వినియోగం చేసేవారిలో ఎక్కువగా సెలబ్రిటీలే ఉంటారన్నది నిజం కాదు. డబ్బులు బాగా సంపాదించే వారిలో వ్యాపారవేత్తల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ వరకు డ్రగ్స్‌ వినియోగించేవారిలో ఉంటారని నివేదికలు చెబుతున్నాయి. అయితే మీడియా ఎక్కువగా హై-ప్రొఫైల్ కేసులను కవర్ చేస్తుంటుంది. అందుకే సెలబ్రిటీల రేవ్‌ పార్టీ వార్తలు క్షణాల్లో వైరల్‌ అవుతుంతాయి. నిజానికి రేవ్‌ పార్టీల్లోనే కాదు పెద్ద నగరాల్లో చిన్న చిన్న పబ్బుల్లోనూ డ్రగ్స్‌ వినియోగం గుట్టుచాటుగా జరుగుతోందని కొన్ని కేసులు చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

చాలా మంది ఇండియన్‌ సెలబ్రిటీలు డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో చిక్కుకొని ఉన్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రియా చక్రవర్తి, అర్మాన్ కోహ్లి, మమతా కులకర్ణి లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు తెలుగు ఇండిస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం గతంలో డ్రగ్స్‌ కేసుల్లో ఇరుక్కున్నారు.

2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. 12 మంది టాలీవుడ్‌ స్టార్స్‌కు అప్పుడు డ్రగ్స్‌ కేసులో చిక్కుకున్నారు. వీరిలో రవితేజ, పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు సహా 11 మంది ఉన్నారు. ఈ కేసు విచారణ కోసం అప్పట్లో తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న ముమైత్ ఖాన్‌ను షో నుంచి బయటకు రప్పించారు. అయితే ఆ తర్వాత మెల్లిగా ఈ డ్రగ్ కేసు టాలీవుడ్‌ (Tollywood) లో కనుమరుగైంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు.

publive-image

నిజానికి ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీకి కూడా పాకింది. టాలీవుడ్‌‌లో కొంత మంది స్టార్స్‌ విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తుంటాయి. ఇటు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులో నిత్యం నైజిరియన్లు అరెస్ట్ అవుతుంటారు. అయితే ఏ సినీ సెలబ్రిటీ అరెస్ట్ అవ్వరు. ఇంతకీ ఆ నైజిరియన్లు ఎవరికీ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు? ఎవరో ఒకరికి అమ్మడానికి కదా వాళ్లు ఇండియాలో ఉంటున్నది. ప్రతీసారి డ్రగ్స్‌ అమ్మేవారినే అరెస్ట్ చేస్తున్నారని.. కొనేవారిని చేయడంలేదన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇదే సమయంలో బెంగళూరు అడ్డాగా డ్రగ్స్‌ దందా బయటపడడం.. ఈ కేసులో హేమ లాంటి నటులతో పాటు పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా వినిపిస్తుండడం సంచలనంగా మారింది.

Also Read: Satyabhama Trailer : పోలీస్ ఆఫీసర్ గా కాజల్.. ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..!

Advertisment
తాజా కథనాలు