Modi Caste Row: మోదీ అసలైన కులం ఏంటి? రాహుల్‌ గాంధీ చెప్పినదాంట్లో నిజమెంత?

రాహుల్‌గాంధీ ఆరోపించినట్టు ప్రధాని మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదా? ఆయన గుజరాత్‌ సీఎంగా మారిన తర్వాతే తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారా? అసలు మోదీ కులమేంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Modi Caste Row: మోదీ అసలైన కులం ఏంటి? రాహుల్‌ గాంధీ చెప్పినదాంట్లో నిజమెంత?

What Is PM Modi Caste: దేశరాజకీయాలను కులాలను వేరు చేసి చూడలేం. ఆంధ్రప్రదేశ్‌ అయినా, గుజరాత్‌ అయినా.. ఏ రాష్ట్ర రాజకీయాలైనా కులాల ప్రస్తావన లేకుండా ముందకుసాగవు. ప్రస్తుతం దేశనాయకులు 'బీసీ' జపం చేస్తున్నారు. కులగణన చేయాలని యాంటీ-బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. బీహార్‌ ఇప్పటికే కులగణనను పూర్తి చేయగా.. ఏపీతో పాటు పలురాష్ట్రాలు ఆ దశగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బీజేపీతో పాటు దాని మిత్రపక్ష పార్టీలు కులగణనపై వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ వీలుచిక్కినప్పుడల్లా ఈ విషయంలో బీజేపీని కార్నర్ చేస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ఈ క్రమంలోనే మోదీ కులంపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చకు దారితీశాయి. మోదీ అసలు బీసీ కులానికి చెందినవాడు కాదని.. ఆయన పుట్టుక జనరల్‌ కేటగిరీ కాబట్టి.. బీసీ గణనను ఆయన అంగీకరించడంలేదంటూ రాహుల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ రాహుల్‌ ఉద్దేశ్యం ఏంటి? అసలు మోదీని కులం ఏంటి? రాహుల్ చెప్పినదాంట్లో ఎంత నిజముంది?


రాహుల్‌ ఏం అన్నారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ కేటగిరీలో పుట్టలేదన్నారు రాహుల్‌. ఆయన గుజరాత్‌లోని 'టెలి' కులంలో జన్మించారని ఒడిశాలోని జర్సుగూడలో రాహుల్ గాంధీ కామెంట్స్ చేవారు. ఈ కులాన్ని బీజేపీనే OBCలో చేర్చిందన్నారు. 2000లో 'టెలి'ని బీజేపీ OBC కేటగిరీలో చేర్చిందని.. అంతకు ముందు టెలీ కులం ఓపెన్ కేటగిరీ అని రాహుల్ గాంధీ చెప్పారు. ఓబీసీ కేటగిరీలో పుట్టనందున.. కుల ఆధారిత జనాభా గణనను మోదీ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎందుకంటే మోదీ ఇప్పటికీ ఓపెన్ కేటగిరీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

publive-image టెలి ఆయిల్ ప్రెస్, 1929 ... (మోద్ ఘంచి) కులం వృత్తి-ఆహార నూనెల వెలికితీత

అసలు మోదీ కులం ఏంటి?
మోదీ 'టెలి' ఉపకులాల్లో ఒకటైన మోద్-ఘంచి క్యాస్ట్‌కు చెందినవారు. వీరు ఆహార నూనెల వెలికితీతకు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారు. గుజరాత్‌లోని 104 OBC కులాల సెంట్రల్ లిస్ట్‌లోని ఎంట్రీ 23లో 'ఘంచీ (ముస్లిం), టెలీ, మోద్ ఘంచి, తెలి-సాహు, తెలీ-రాథోడ్, తేలి-రాథోడ్ ఉన్నాయి. అయితే ఇవి మొదటి నుంచి ఓబీసీలో ఉన్నాయా లేదా రాహుల్‌ చెప్పినట్టు 2000వ సంవత్సరంలో ఓబీసీలో వీటిని యాడ్ చేశారా అన్నది తెలుసుకుందాం.


ఇంతకీ ఏది నిజం?
నిజానికి ఘంచీ పేరు మీద రెండు కులాలు ఉన్నాయి. ఒకటి ముస్లింలకు సంబంధించిన కులం.. రెండోది మోదీ కులం(మోద్‌ ఘంచి). ఇందులో ముస్లింల ఘంచి కులాన్ని 1999లో ఓబీసీ క్యాటగిరీలో చేర్చారు. ఇక ఏప్రిల్ 4, 2000న గుజరాత్‌లోని 'మోద్ గాంచీ', 'టెలి సాహు', 'టెలి రాథోడ్' , 'టె రాథోర్' లాంటి కులాలను గుజరాత్‌లోని ఓబీసీల జాబితాలో చేర్చారు. ఇంటర్నెట్‌లో ఉన్న సమచారాన్ని చూస్తే ఈ లెక్కలు, తేదీలు కనిపిస్తున్నాయి. అంటే వీటి ప్రకారంరాహుల్‌ చెప్పినట్టు మోదీ పుట్టినప్పటి నుంచి ఓబీసీ కాదన్నది నిజమే.


బీజేపీ వాదన ఏంటి?
అయితే ఇక్కడ బీజేపీ మరోలా వాదిస్తోంది. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వ హయంలో మోదీ కులాన్ని(మోద్‌ ఘంచి) ఓబీసీలో చేర్చారని కాంగ్రెస్‌ చెబుతోండగా.. అది అవాస్తవమంటోంది బీజేపీ. కమలం పార్టీ ఎంపీ నరహరి అమీన్ చేసిన ట్వీట్ వైరల్‌ అవుతోంది. 1994లో నరహరి అమీన్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పుడు గుజరాత్ డిప్యూటీ సీఎం ఆయనే. జూలై 25, 1994లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోద్‌ ఘంచి(మోదీ క్యాస్ట్)కులాన్ని ఓబీసీలో చేర్చిందని ఆయన చెబుతున్నారు. రాహుల్‌ అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు అమీన్.


నిజానికి ఇంటర్‌నెట్‌లో ఉన్న సమచారం ఆధారంగా లేదా అమీన్‌ చెప్పిన తేదీల పరంగా చూస్తే అప్పటికీ మోదీ గుజరాత్‌కు సీఎం కాదు.. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. 2001లో ఆయన గుజరాత్‌ సీఎంగా ప్రమాణం చేశారు. ఇంటర్‌నెట్ డేటా లేదా అమీన్‌ మాటల పరంగా చూస్తే మోదీ సీఎం కాకముందే ఆయన కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఇది క్లియర్‌గా అర్థమవుతున్న మేటర్. ఇక పేరు చివరన మోదీ ఉన్నంత మాత్రానా అది ఒక కులానికే సంబంధించినదని చెప్పడానికి వీల్లేదు. పేరు చివర మోదీతో ముస్లీంలు, పార్శీలు కూడా ఉన్నారు.

ఈ వివాదానికి కారణం ఏంటి?
నిజానికి ఇంత ఉన్నట్టుండి మోదీ కులంపై భారీ ఎత్తున డిస్కషన్‌ జరగడానికి బలమైన కారణం ఉంది. ఇటీవలి బడ్జెట్‌ సెషన్‌లో కాంగ్రెస్‌ టార్గెట్‌గా మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓబీసీ వర్గానికి కాంగ్రెస్ ఎప్పుడూ న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఓబీసీ నాయకులను అవమానించడంలో ఎలాంటి రాయిని కాంగ్రెస్‌ వదిలిపెట్టలేదన్నారు మోదీ. కర్పూరి ఠాకూర్‌కి మరణానంతరం భారతరత్న ప్రకటించామని.. అయితే కర్పూరి ఠాకూర్‌తో కాంగ్రెస్ చాలా అపకీర్తితో వ్యవహరించిందని విరుచుకుపడ్డారు మోదీ. 1970లో కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆయనను తొలగించేందుకు కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని ఆరోపించిన మోదీ.. వెనుకబడిన ప్రజల కోసం కాంగ్రెస్ పనిచేయదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌ని దృష్టిలో పెట్టుకోనే ఓబీసీ కులగణన అంశాన్ని రాహుల్‌ ఒడిశాలో లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. ఇలా మొత్తానికి బీసీల చుట్టూ దేశరాజకీయాలు తిరుగుతుండడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: గ్రూప్​-1 వయోపరిమితి పెంపు

Advertisment
తాజా కథనాలు