What Is Nag Ashwin's Vision On Kalki 2898 AD : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహాభారం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక తాజాగా రిలీజైన థీమ్ సాంగ్ తో నాగ్ అశ్విన్ సినిమాలో ఏం చెప్పబోతున్నాడు అనేదానిపై కొంత క్లారిటీ వచ్చింది. దాని ప్రకారం.. కథ మొత్తం కల్కి పాత్ర చుట్టే తిరుగుతుంది. మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే 'కల్కి'.
కలియుగం చివరి పాదంలో భగవంతుడు ‘ కల్కి’రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురణాలు చెబుతున్నాయి. ఈ పాయింట్ ను నాగ్ అశ్విన్ తీసుకొని సినిమాటిక్‌గా వేలో చుపించాబోతున్నాడు. ఇందులో కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ సినిమా. కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం. అయితే ఇందులో 'కల్కి' ఎవరు? 'కలి' ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు.
Also Read : పీక్స్ కు చేరిన ‘కల్కి’ క్రేజ్.. తొలి రోజే రూ.200 కోట్లా?
హీరో ప్రభాస్ పోషించిన పాత్ర పేరు 'భైరవ'. అశ్శత్థామగా అమితాబ్ నటించాడు. కమల్ పోషించిన పాత్ర పేరు 'సుప్రీం యాస్కిన్'. ఇక గర్భిణీ 'సుమతి' గా దీపికా పదుకొణె నటించింది. కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమెను కాపాడడం కోసం అశ్వత్థామ పొరాటం చేస్తున్నాడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. 'కల్కి' అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
అయితే సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సుప్రీం యాస్కిన్ పాత్ర 'ఎన్ని యుగాలైనా మనిషి మారడు. మారలేడు' అనే డైలాగ్ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్ చెప్పిన డైలాగ్‌ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది.
మరి సినిమాలో భైరవగా నటించిన ప్రభాస్‌నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే 'కల్కి'ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారా?. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే 'కల్కి'ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. మరి సినిమాలో కలి ఎవరు? కల్కి ఎవరు? అనేది కచ్చితంగా తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.