Health:మెటాస్టాటిక్ క్యాన్సర్ తో చనిపోయిన సహారా ఛీఫ్..అసలేంటిది?

రెండు రోజుల క్రితం సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ఈయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినప్పటికీ ఆయన దీర్ఘ కాలంగా మెటాస్టాటిక్ క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. దీంతో అసలేంటీ మెటా స్టాటిక్ క్యాన్సర్‌...ఇదొక కొత్త రకమైన క్యాన్సర్‌ అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

New Update
Health:మెటాస్టాటిక్ క్యాన్సర్ తో చనిపోయిన సహారా ఛీఫ్..అసలేంటిది?

సహారా ఛీఫ్ సుబ్రతా రాయ్ వయసు 75 సంవత్సరాలు. ఈయనకు మెటాస్టాటిక్ కాన్సర్, డయాబెటీస్, బీపీ ఉన్నాయి. ఈరోజుల్లో సుగర్, బీపీలు చాలా నార్మల్ కానీ క్యాన్సర్‌ మాత్రం ఒక మహమ్మారి. అయితే ఇందులో చాలా రకాలుంటాయి. నోటి క్యాన్సర్‌, లివర్ క్యాన్సర్‌, బ్రెస్ట్ క్యాన్సర్‌...ఇలా. వీటి గురించి దాదాపు అందరికీ అవగాహన ఉంది. ఇవి వేటి ద్వారా వస్తాయనే విషయం కూడా జనాలకు బాగా తెలుసు. కానీ మెటా స్టాటిక్ క్యాన్సర్‌...దీని పేరు వినడం మాత్రం ఇదే మొదటిసారి. దీంతో ఇదేమి అన్న సందేహం కలుగుతోంది. ఇదొక క్యాన్సర్‌ రకమైతే ఇప్పటివరకు ఎందుకు తెలియలేదఉ. ఈ టైప్ ఆఫ్ కాన్సర్ సుబ్రతా రాయ్ కే మొదట వచ్చిందా అని ప్రశ్నలు అడుగుతున్నారు.

Also Read:సౌత్ ఆఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం

మెటాస్టాటిక్ క్యాన్సర్‌..నిజానికి ఇదేమీ కొత్త రకం క్యాన్సర్‌ కాదు. క్యాన్సర్‌ లో లాస్ట్ స్టేజ్ అంటే నాలుగో దశను మెటాస్టాటిక్ అంటారు. సాధారణంగా క్యాన్సర్‌ నాలుగు దశలుగా ఉంటుంది. శరీరంలో అసాధారణంగా కణితి రావడాన్ని క్యాన్సర్‌ అంటారు. క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లేదా కణితి రెండు సెంటీమీటర్ల పరిణామం ఉన్నప్పుడు గుర్తిస్తే దీన్ని పూర్తిగా నివారించవచ్చును. కానీ ఆ క్యాన్సర్ గడ్డ కనుక ముదిరి పెద్దది అయితే మాత్రం ఎవరూ కాపాడలేదు.

క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత చిన్న చిన్న లక్షనాలు కనిపిస్తాయి. అయితే అవి మనకు సాధారణంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులులా ఉంటాయి. అందుకే వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఈ కనాలు గడ్డగా ఏర్పడ్డం మొదలయినప్పటి నుంచి బాడీలో రోగ లక్షణాలు అధికమవుతూ ఉంటాయి. కణితి రెండు సెటీమీటర్లు ఉంటే క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్టు. అది 2 నుంచి 5 కు పెరిగితే రెండో దశకు చేరుకున్నట్టు. అంతకు మించి పెరుగుతూ ఉంటే క్యాన్సర్ 3, 4 దశలకు చేరుకుంటుంది. అయితే చాలా మందిలో క్యాన్సర్ 3 లేదా 4 దశలకు చేరుకున్న తర్వాతనే గుర్తించగలుగుతారు. మొదటి దశలో క్యాన్సర్ ను గుర్తించడంలో డాక్టర్లు కూడా కొన్ని సార్లు ఫెయిల్ అవుతుంటారు అనేది వాస్తవం.

క్యాన్సర్ తో చనిపోయిన వాళ్ళందరూ ఇలా 3, 4 దశల్లో గుర్తించడం వల్లనే చనిపోయారు. తాజాగా చనిపోయిన సహారా ఛీఫ్ సుబ్రతో రాయ్ కు కూడా మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉంది. ఇది చివర దశకు చేరుకోవడంతో ఆయన కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే కార్టియాక్ అరెస్ట్ అవడంతో సుబ్రతా రాయ్ కన్నుమూశారు.

Advertisment
తాజా కథనాలు