Health benefits: పండు మిర్చి..పచ్చి మిర్చిలో ఏది మంచిది..?

మన వంట చేసేటప్పుడు ఏ ఐటమ్స్ ఉన్నా లేకపోయినా మిర్చి అనేది కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్. ఇది లేకపోతే ఆ కూరకు టెస్ట్, ఘాటు కూడా రాదు. అయితే ఈ మిర్చిలో ఎండు, పండు, పచ్చిమిరపకాలు అనే మూడు రకాలు ఉంటాయి. వీటిని రోజు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Health benefits: పండు మిర్చి..పచ్చి మిర్చిలో ఏది మంచిది..?

fruit, green chillies: ఈ మిరపకాయలు చాలా రకాలు ఉంటాయి. అవి వాడటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. దాంతోపాటు కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్ మన శరీరానికి పుష్కలంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వంటలో వేసే మిర్చి రూచే వేరుగా ఉంటుంది. అయితే.. ప్రతిరోజు మనం వండే కూరల్లో పచ్చిమిరపకాయలను వేసి వంట చేస్తాం. అయితే కొందరు పండుమిరపకాయలను కూడా ఎక్కువగా వాడుతారు. ఈ రెండిటిలో ఏది మంచిది.. ఇందులో అసలు పోషకాలు అధికంగా ఉంటాయి అనే అనుమానం అందరికి ఉంటుంది. అయితే ఈ రెండు మిరపకాయలు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇస్తుంది. వీటిలో ఏది బెటర్ అనే దాని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.

హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది

పండుమిరపలో విషయానికి వస్తే ఎక్కువగా పోషకాలు ఉన్నాయి. విటమిన్-ఏ, బి, విటమిన్-సి, బీటా కెరోటిన్ ఇలా చాలా రకాల ఖనిజాలు మిరపకాయలులో ఉన్నాయి. ఈ పండు మిరపకాయలను తినడం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. పండుమిరపలో క్యాన్సర్లతో పోరాడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పండుమిరప ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జీర్ణ వ్యవస్థలో ఉండే హానికర బ్యాక్టీరియాలను నిర్మూలించడంలో ఇది బెస్ట్‌ అంటున్నారు. ఆకలికి లేనివారికి పండుమిరప రోజు తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుందట. అంతేకాకుండా.. రక్త ప్రసరణ కూడా ఎక్కువగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

తలనొప్పి నుంచి ఉపశమనం

రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగి జలుబు, జ్వరం తగ్గిపోతాయి. నొప్పులు, వాపుల నుంచి కూడా ఈ పండుమిరప తినడం వల్ల మంచి ఉపశమనం వస్తుంది. సోరియాసిస్, డయాబెటిస్, ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారు పండుమిరపలను రోజూ తింటే ఈ సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. అంతేకాకుండా ఈ పండుమిరపకాయలు తింటే జీర్ణశక్తిని పెంపొందించి జీవ క్రియ బాగా జరిగేలా చూస్తుంది. బరువును నియంత్రించడంలో కూడా పండుమిరప చాలా బాగా ఉపయోగపడతాయి. అందరూ.. వీటిని తినడం వల్ల శరీరంలో శక్తితో పాటు క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతుంది. దీంతో వ్యాయామం చేసినంత ఫీలింగ్ ఉంటుంది. గొంతు, ఊపిరితిత్తులు, ముక్కులో ఉండే శ్లేష్మం కరిగిపోయి.. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు తగ్గుతారు, సైనస్, ఆస్తమా, జలుబులాంటి సమస్యలు ఉన్నవారు పండుమిరపకాయలను తినడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:దొంగా.. దొంగా.. బాబోయ్‌.. ఏకంగా ఆలయానికే కన్నం వేశారుగా

Advertisment