Coriander: కొత్తిమీరను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేది ఇదే

కొత్తిమీరను రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. కొత్తిమీరలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.కొత్తిమీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

New Update
Coriander: కొత్తిమీరను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేది ఇదే

Coriander: కొత్తిమీరలో ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తిమీరను రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీర కుంకుమపువ్వు కుటుంబానికి చెందినది. దీని రుచి చాలా మందికి నచ్చకపోయినా ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. కొత్తిమీర రోజూ తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కొత్తిమీర పోషకాలు:

  • కొత్తిమీరలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల కొత్తిమీరలో 35 కేలరీలు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్ - 5.31 గ్రా, ప్రోటీన్ - 3 గ్రా, నీరు - 0.31 గ్రా, ఫైబర్ - 3.7 గ్రా, చక్కెర - 2 గ్రా, కాల్షియం -156 ఎంజి, ఐరన్- 3.96 ఎంజి, విటమిన్ సి - 2.3 ఎంజి, విటమిన్ ఎ - 200 ఐయు దీనిలో ఉంటాయి.

మధుమేహం నియంత్రణకు:

  • కొత్తిమీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో తగినంత మార్పును కలిగిస్తుందని పరిశోధకుల నమ్మకం.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి:

  • కొత్తిమీర రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించే కొత్తిమీర, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇప్పటికే కొలెస్ట్రాల్‌కు మందులు వాడుతున్న వారు కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలి.

నొప్పులను తగ్గిస్తుంది:

  • కొత్తిమీరలో అధిక ఒత్తిడి వల్ల వచ్చే కడుపు నొప్పి, అల్సర్‌లకు ఉపశమనం కలిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కడుపులో పుండ్లను నయం చేస్తుంది. కడుపులోని కండరాలను బలపరుస్తుంది. కొత్తిమీర రసంలో అనేక వైద్య గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని బాహ్య, అంతర్గత పుండ్లను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటమే కాకుండా మంటను తగ్గిస్తుంది. కొత్తిమీరలో అనేక యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి సాల్మొనెల్లో సహా బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లపై దాడి చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఆస్తమా:

  • జంతు ప్రేరిత ఆస్తమాను నియంత్రించడంలో కొత్తిమీర సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఆస్తమాతో బాధపడేవారు కొత్తిమీరను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.

కొత్తిమీర సైడ్ ఎఫెక్ట్స్:

  • కొత్తిమీరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపు నొప్పి, అపానవాయువు వస్తుంది. తాజా కొత్తిమీర తినాలనుకునే వారు ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మొలకెత్తిన ఉల్లిని వాడటం మంచిదేనా?..వాడితే ఏమవుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు