Ganapati Festivals: హిందూధర్మంలో పని ప్రారంభించేటపుడు ప్రథమ పూజ గణపతికి చేస్తారు. పిల్లలకు విద్య ప్రారంభ సమయంలో అక్షరాభ్యాసంలో గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిధి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభ మవనున్నంది.వినాయకుడున్ని విఘ్నాలకు ఆధిపతి అని అంటారు. ఎలాంటి అడ్డంకులను తొలగించేవాడని అర్ధం. అందుకే గణపతి నవరాత్రి ఉత్సవాలను కొత్త పనిని ప్రారంభించడానికి పవిత్రమైనదిగా పండితులు చెబుతారు.
హిందూమతంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండుగను వినాయకుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వైభవంగా చేస్తారు. వినాయక చవితి రోజున గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి 3, 5, 9, 10 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని నవరాత్రి ఉత్సవాలను చేసిన చివరి రోజున నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. పండుగ సందర్భంగా కీర్తనలు, నృత్యాలు, భజనలు, ఇతర సాంస్కృతిక, అన్నధాన కార్యక్రమాలు చేస్తారు. 11వ రోజున చివరి రోజూగా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో గణేష్‌ని పూజించే సమయంలో వినాయక స్తోత్రాన్ని పఠిస్తారు. ఇలా చేయటం వల్ల అన్ని కష్టాలు తొలగి జీవితంలో ప్రతిపనిలో విజయంతో ఆనందం లభిస్తుందంటారు.
గణేష్ స్తోత్రం పారాయణం:
ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.