Almonds: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!

కేశాలను రక్షించుకోవడంలో కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. అయితే బాదం పప్పు తినే విషయం లో చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మెయిన్‌ గా చేసే పొరపాటు ఏంటంటే..చాలా మంది బాదం పప్పును నానబెట్టకుండా తినేయడం.

New Update
Almonds: బాదం పప్పును నానబెట్టకుండా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!

Almonds: డ్రైఫ్రూట్స్‌ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది బాదం పప్పు అనే చెప్పవచ్చు. బాదంలో ప్రోటీన్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్‌, మాంగనీస్‌, విటమిన్‌ బి, విటమిన్‌ ఇ తో పాటు ఫైబర్‌, మంచి కొవ్వు పదార్థాలు, శక్తి నిచ్చే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బాదం పప్పు కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేటి కాలంలో ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య జుట్టు రాలిపోవడం (Hair Fall). కేశాలను రక్షించుకోవడంలో కూడా బాదం బాగా ఉపయోగపడుతుంది. అయితే బాదం పప్పు తినే విషయం లో చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు.

Also read: పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలొచ్చాయి!

అలా చేయడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మెయిన్‌ గా చేసే పొరపాటు ఏంటంటే..చాలా మంది బాదం పప్పును నానబెట్టకుండా తినేయడం. కొందరు బాదంను రాత్రి పూట నానబెట్టకుండా డైరెక్ట్‌ గా తినేస్తుంటారు.

కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బాదం పప్పు పొట్టులో ఫైటిక్‌ యాసిడ్‌తో పాటు యాంటీ న్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి నానబెట్టకుండా తినడం వల్ల గాల్‌ బ్లాడర్‌ లో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. అంతేకాకుండా నేరుగా బాదం పప్పును తినడం వల్ల అవి త్వరగా జీర్ణం కావు.

Also read: తాను చనిపోతూ కూడా 48 మందిని బతికించిన డ్రైవర్‌!

దీంతో జీర్ణ వ్యవస్థ పై తీవ్ర ఒత్తిడి పడి బలహీనంగా మారిపోతుంది. దాని వల్ల గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. బాదం పొట్టులో టానిన్లు ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించకుండా అడ్డుపడతాయి. అందుకే బాదంను కచ్చితంగా నానబెట్టుకునే తినాలి.

రాత్రి పూట పడుకునే ముందు ఐదారు గింజలను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టు తీసేసి తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మెదడు పని తీరు కూడా బాగుంటుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోవడంతో పాటు గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.

నాన బెట్టిన బాదం ప‌ప్పుల‌ను (Soaked Almonds) రోజు ఉద‌యాన్నే తింటే మ‌ధుమేహం, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చే అవకాశాలు కూడా తక్కువ. ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.

Advertisment
తాజా కథనాలు