Polished Rice : పాలిష్‌ చేసిన బియ్యం తింటే ఏమవుతుంది?.. అసలు ఏ బియ్యం తినాలి?

పాలిష్ చేసిన బియ్యంలో విటమిన్లు, ఖనిజాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, పిండి పదార్ధాలు మాత్రమే మిగిలిపోతాయి. ఈ బియ్యం తిన్నడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలిష్‌ చేసిన బియ్యంలో గ్లైసెమిక్ ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం.పాలిష్‌ చేయని బియ్యం మంచిది.

New Update
Polished Rice : పాలిష్‌ చేసిన బియ్యం తింటే ఏమవుతుంది?.. అసలు ఏ బియ్యం తినాలి?

Polished Rice Side Effects : బరువు తగ్గాలనుకునేవారు(Weight Loss) లేదా మధుమేహం(Diabetes) తో బాధపడేవారు పాలిష్ చేసిన బియ్యం తినకూడదని చాలా మంది చెబుతుంటారు. పాలిష్ చేసిన బియ్యాని(Polished Rice) కి బదులుగా బ్రౌన్, బ్లాక్ లేదా రెడ్ రైస్ తినాలని నిపుణులు చెబుతారు. వాస్తవానికి పాలిష్ చేసిన బియ్యంలో అన్ని విటమిన్లు, ఖనిజాలు పోతాయి. కార్బోహైడ్రేట్లు, పిండి పదార్ధాలు మాత్రమే మిగిలిపోతాయి. ఈ బియ్యం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కోసం ఎలాంటి బియ్యం తినాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పాలిష్ చేసిన బియ్యం:

  • పాలిష్‌ చేసిన బియ్యంలో అధిక గ్లైసెమిక్(Glycemic) ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం. పాలిష్‌ చేయని బియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు. పాలిష్ చేయని బియ్యంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలిష్‌ చేసిన బియ్యం తింటే కడుపు నిండదు, దీని వల్ల బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.

బ్రౌన్‌, రెడ్‌ రైస్‌ తింటే:

  • బ్రౌన్, బ్లాక్, రెడ్ రైస్‌లో ఫైబర్‌తో పాటు అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. పాలిష్ చేసిన బియ్యం కంటే చేయని బియ్యంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఈ అన్నం తినాలని నిపుణులు చెబుతున్నారు. పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ మోతాదులో తిన్నా కూడా పొట్ట చాలా సేపు నిండుగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: జామపండ్లు తిన్నాక వీటిని తింటే ఇక అంతే సంగతులు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు