/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-52-2.jpg)
Team India: T20 వరల్డ్ కప్ 2024 లో ఇండియా అత్యద్భుత విజయం సాధించి ట్రోఫీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ళ తరువాత 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది. ఈ లీగ్ లో ప్రతీ మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ చేరిన భారత జట్టు.. ఫైనల్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి అదరగొట్టింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంది.
Moments that will stay etched in our memories forever ♾️ 😊#T20WorldCup | #TeamIndia | #SAvIND pic.twitter.com/1xZj9hmDWq
— BCCI (@BCCI) June 30, 2024
ముఖ్యంగా రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), హార్దిక్ పాండ్య.. స్టేడియంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక కప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ ఉత్సాహంతో నిండిపోయింది. ప్లేయర్లంతా ఒక్కచోట కూర్చొని తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ తరుణంలో బెస్ట్ ఫీల్డర్ మెడల్ ప్రదానం చేయడానికి బీసీసీఐ సెక్రటరీ జైషాను (Jay Shah) ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజును మనం జయించాం.
నేటితో పాటు టోర్నమెంట్ ఆసాంతం మనం చూపిన తెగువ, పట్టుదల అద్భుతం. ద్రవిడ్, రోహిత్ ప్రతిఒక్కరికీ తమ పాత్రేంటో తెలుసని చెబుతూనే ఉన్నారు. కానీ, మనం కలసికట్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వేటాడాం. దేన్నీ వదిలిపెట్టలేదు’’ అని దిలీప్ అన్నారు. అనంతరం సూర్యకుమార్‌కు (Suryakumar Yadav) జైషా మెడల్‌ను ప్రదానం చేశారు. దీనిపట్ల సంతోషం వ్యక్తం చేసిన సూర్య.. వరల్డ్ కప్ మెడల్‌తో పాటు దాన్నీ కెమెరాకు చూపుతూ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో కనిపించాడు.
— BCCI (@BCCI) June 30, 2024