Increasing Height: ఎత్తు పెరగకపోవడానికి కారణాలేంటి?..ఏం తింటే పెరుగుతారు? పొట్టిగా ఉన్నామని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎత్తు పెరిగేందుకు రకరకాల సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. వీటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. వ్యాయామం చేయడం, ప్రొటీన్ ఫుడ్, విటమిన్ డి ఉండేలా చూసుకుంటే ఎత్తు పెరగవచ్చని చెబుతున్నారు. By Vijaya Nimma 05 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Increasing Height: చాలా మంది హైట్‌గా లేమని బాధపడుతూ ఉంటారు. పొట్టిగా ఉన్నారంటూ స్నేహితులు కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే ఎత్తు పెరగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వ్యాయామాలు చేయడంతో పాటు వాకింగ్‌కు వెళ్లడం, స్విమ్మింగ్ చేయడం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని ప్రోటీన్ పౌడర్లు కూడా వాడుతూ ఉంటారు. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రతి ఒక్క మగవారు ఆరు అడుగులు ఉండాలని, మహిళలైతే ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా పురుషులు 21 సంవత్సరాలు వచ్చే వరకు ఎత్తు పెరుగుతారు. ఆ తర్వాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఆడవారి విషయానికి వస్తే 19 సంవత్సరాలు వచ్చేవరకు హైట్ పెరుగుతారు. ఎత్తు పెరగడం మన జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రోజు ఎక్కువగా ఎండలో ఉండేలా చూసుకోవాలి మన కుటుంబంలో ఎవరైనా ఎత్తుగా ఉంటే మనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అనేక మంది ప్రస్తుత కాలంలో ఎత్తు పెరగాలంటే రకరకాల సర్జరీలు చేయించుకుంటున్నారు. ఆపరేషన్ చేయించుకుంటే కొన్ని దుష్పరిణామాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరగడం అనేది వయసులో ఉన్నప్పుడే సాధ్యం. మంచి ఆహారం, వ్యాయామం చేయడం వల్ల ఎత్తు పెరుగుతారు. గ్రోత్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి పనిచేసే తీరును మెరుగుపరిచేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శరీరానికి సరిపడా విటమిన్ డి లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఎక్కువగా ఎండలో ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా చదవండి: పిల్లలు మొండిగానే ఉంటారు..వాళ్లను దారిలోకి తెచ్చుకోండి ఇలా..!! ఈ ఎండలో ఉండడం వీలుకాని వారు విటమిన్-డీ ట్యాబ్లెట్లను వాడవచ్చు. అంతేకాకుండా కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. 20 సంవత్సరాల లోపు ఉండే యువకులు 600 మిల్లీగ్రాముల వరకు కాల్షియం అందేలా చూసుకోవాలి. ఎదిగే పిల్లలకు తగినంత ప్రోటీన్ ఇవ్వాలి. ఒక కిలో బరువుకు గాను రెండు గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. నానబట్టిన పల్లీలు, మొలకెత్తిన గింజలతో పాటు పుచ్చగింజల పప్పు, పొద్దు తిరుగుడు, గుమ్మడి గింజలు, అలాగే డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. వారంలో రెండుసార్లు మిల్ మేకర్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన బాడీకి తగిన ప్రోటీన్ లభిస్తుంది. థైరాయిడ్ గ్రంథి కూడా బాగా పనిచేస్తుంది. యోగా చేయడం వల్ల కూడా ఎత్తు పెరగవచ్చు. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీంతో ఎత్తును పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. #health-tips #height మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి