ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నది బీజేపీ స్ట్రాటజీ. పొలిటికల్‌గా, సిద్ధాంతపరంగా బీజేపీ అస్త్రమిది. దేశం మొత్తం ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ కల. తమ కలలను ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటున్న బీజేపీ 2024 ఎన్నికల్లో గెలిస్తే.. ఆ తర్వాత దేశంలోని మరిన్ని మార్పులకు శ్రీకారం చూడుతుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీ(BJP) గెలవకూడదని కాంగ్రెస్‌తో పాటు యాంటీ-బీజేపీ పార్టీలు శర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 28 పార్టీలు ఒకేతాటిపైకి రావడమే కాకుండా ఒకే మాటపై నిలపడుతున్నాయి. ఈ క్రమంలోనే 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు(One Nation One Election)'పై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ(Mamata Banerjee) అత్యున్నత స్థాయి కమిటీకి లేఖ రాశారు.
ఏకీభవించవద్దు:
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ గురువారం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్‌కు తెలిపింది. ఈ నెల ప్రారంభంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆయన సీపీఐ కౌంటర్ డి రాజా సమర్పించిన ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సమయంలో మమత లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత రాజ్యాంగ ఏర్పాట్ల ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదన ఉందన్నారు దీదీ. ఒక దేశం ఒకే ఎన్నికలు అనే భావనతో ఏకీభవించవద్దని కోరారు.
మార్చకూడదు.. మార్చవద్దు:
ప్యానెల్ సెక్రటరీకి రాసిన లేఖలో మమత బెనర్జీ కీలక విషయాలను ప్రస్తావించారు. నిజానికి 1952లో మొదటి సాధారణ ఎన్నికలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలకు ఒకేసారి జరిగాయి. కొన్నాళ్లుగా అలాంటి ఏకకాలికత ఉందని.. ఆ తర్వాత లేదన్నారు మమత. మీరు రూపొందించిన 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అనే భావనతో నేను ఏకీభవించలేనందుకు చింతిస్తున్నాను. మీ సూత్రీకరణ, ప్రతిపాదనతో మేము విభేదిస్తున్నాము' అని దీదీ లేఖలో రాశారు. వెస్ట్‌మిన్‌స్టర్ వ్యవస్థలో ఏకకాల సమాఖ్య , రాష్ట్ర ఎన్నికలు ఒక ప్రాథమిక లక్షణమని.. దీన్నీ మార్చకూడదన్నారు దీదీ. ఏకకాలంలో ఉండకపోవడం అనేది భారత రాజ్యాంగ ఏర్పాట్ల ప్రాథమిక నిర్మాణంలో భాగమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
Also Read: గంట మళ్లీ జంప్.. ఈ సారి పోటీ ఎక్కడినుంచంటే?
WATCH: