West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..

మమతా బెనర్జీ ప్రభుత్వం అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం ఎవరైనా లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడితే ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు.

West bengal: దీదీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక బిల్లు ఆమోదం..
New Update

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అత్యాచార వ్యతిరేక(Anti-Rape) బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో సవరణలు చేసిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్‌ బిల్‌ 2024 అనే పేరుతో దీదీ సర్కార్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎవరైనా ఓ వ్యక్తిపై లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడినప్పుడు ఈ ఘటనలో బాధితులు చనిపోయినా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లైతే దోషులకు మరణ శిక్ష విధిస్తారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు అపరాజిత టాస్క్ ఫోర్స్‌ దీనిపై ఓ నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత 21 రోజుల్లోనే దోషులకు మరణ శిక్ష పడుతుంది.

Also Read: కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 9 మంది మావోయిస్టులు మృతి!

ఇటీవల మరణించిన ఆర్‌జీ కర్‌ మెడికల్ కాలేజ్ జూనియర్‌ డాక్టర్‌కు ఈ బిల్లుతో నివాళులర్పిస్తున్నామని అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లో ఉన్న లోపాలను వెలికితీసేందుకు ప్రయత్నించామన్నారు. అత్యాచారం అనేది మానవులకు ఒక శాపం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాలు ఆపేందుకు సామాజిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అలాగే ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్‌ సంతకం చేసేలా విపక్ష పార్టీ గవర్నర్‌ను కోరాలని అభ్యర్థించారు. వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ నుంచి బాధితురాలికి న్యాయం జరగాలని.. దోషులకు మరణశిక్ష పడాలని వ్యాఖ్యానించారు.

Also Read: IAS స్మితా సబర్వాల్‎కు భారీ ఊరట.. ఆ పిటిషన్‎ కొట్టేసిన కోర్టు

#rape #west-bengal #mamatha-benarjee #cm-mamatha-benarjee
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe