Telangana Rain: ఎర్రటి ఎండల్లో చల్లటి కబురు..2 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. వచ్చే రెండ్రోజుల్లో ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆకాశం మేఘావృతం అవుతుందని అధికారులు అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.