Telangana : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.