Heavy Rains:
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడనుంది. దీని కారణంగా రాలసీమ, కోస్తాంధ్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈనెల 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని...దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు సంభవించొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు పోలీసు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. బలహీనంగా ఉన్న కాలువలు, చెరువుల గట్లు పటిష్టం చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.