Rain in Vijayawada: విజయవాడలో ఇప్పుడిప్పుడే కొంచెం వానలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న నేపథ్యంలో బుధవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద తాకిడి మరోసారి పెరిగింది.
ప్రస్తుతం 1.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంది. బుడమేటి వరద నిలకడగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. బుడమేటి కాల్వ మరమ్మత్తు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బుడమేటికి పడిన గండ్లలో రెండు చోట్ల పూడ్చివేత పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు మంత్రులు పర్యటించనున్నారు. బాధితులకు అందే సహాయ సహకారాలను మంత్రి నారాయణ పరిశీలించనున్నారు. బాధితులకు సాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరా గాంధీ స్టేడియం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారాన్ని అధికారులు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్