Weather Experts Predict that Rains may Hits Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్ష సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. వానలు పడాల్సింది పోయి.. ఎండలు మండిపోతున్నాయి. నిజానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్, జులై, ఆగష్టు నెలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు:
వాస్తవానికి అరేబియా సముద్రం, బంగాళా ఖాతంలో రుతు పవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి వర్షాలు కురవాలి. కానీ ఈ ఏడాది పెద్దగా వర్షాలు కురవలేదు. ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా ఆంధ్ర ప్రదేశ్ లో రుతుపవనాల ప్రభావం లేదని అంటున్నారు.
మళ్లీ వర్షాలు పడతాయి:
కానీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాల ద్రోణి దక్షిణ దిశగా కదలకపోవడంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడినట్లు చెబుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో అక్కడక్కడ తప్ప మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురవలేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ ద్రోణి ప్రభావం ఏపీపై ఉంటుందని అంటున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన నాలుగైదు రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ లో ఏపీలో సాధారణం కంటే ఎక్కువ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టులో మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోయారు. అక్కడక్కడా వర్షం కురుస్తున్నప్పటికీ గంటపాటు భారీ వర్షం కురిసి, మళ్లీ ఒక్కసారిగా నిలిచిపోతుంది.
వింతగా ఆగష్టు నెల వాతావరణం:
ఆగస్టు నెల ఎండాకాలం వింతగా కనిపిస్తోంది.. ఎండ వేడిమితో జనం అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండలు, ఆపై వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీని వల్ల వైరల్ ఫీవర్, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే సెప్టెంబరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!!
Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం
వెస్ట్ బెంగాల్ మైనర్ బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. నెలన్నర తర్వాత కీలక మలుపు!!
Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం