Same sex marriage:మా పోరాటం ఆగిపోదు..సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట

స్వలింగ వివాహాలకు నో చెబుతూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని చెప్పింది. స్వలింగ వివాహాం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. అలా పెళ్ళి చేసుకోవడం వారి ప్రాథమిక హక్కు కాదని తెల్చి చెప్పింది. దీంతో భారత దేశంలో స్వలింగ సంపర్కులు తీవ్ర నిరాశ చెందారు. ఓ స్వలింగ జంట అయితే ఏకంగా కోర్టు ఎదుటే తమ నిరసనను తెలిపారు. ఉంగరాలు మార్చుకుని తమ నిశ్చితార్ధం చేసుకున్నారు.

Same sex marriage:మా పోరాటం ఆగిపోదు..సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట
New Update

సుప్రీంకోర్టు నిన్న సంచలన తీర్పును వెలువరించింది. సేమ్ జెండర్ వివాహాలను చట్టబద్దం కాదని తేల్చి చెప్పింది. వివాహ హక్కుల నిర్ధారణకు ప్రభుత్వం కమిటీ వేయాలని ఆదేశించింది. అసహజంగా జరిగే వివాహాల పట్ల, వ్యక్తుల పట్ల వివక్ష ఎవరూ వివక్ష చూపకూడదని అంది. స్వలింగ సంపర్కుల హక్కులు, అర్హతలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ ప్రకటనను రికార్డు చేస్తున్నామని కోర్టు ప్రకటించింది.

Also Read:ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ..టాప్ 10లో భారత్ ఆటగాళ్ళు

అయితే సుప్రీంకోర్టు తీర్పు స్వలింగ సంపర్కులకు నచ్చలేదు. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ఫలితాలు తమకు అనుకూలంగా రానందుకు వారు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా కోర్టు ఎదుటనే ఉంగరాలు మార్చుకుని, నిశ్చితార్ధం చేసుకుని మరీ తమ నిరసన తెలిపారు. తాము తమ పోరాటాన్ని ఆపేది లేదని ఆ జంట ప్రకటించింది. గతంలో కూడా తాము చాలా చట్టబద్ధమైన నష్టాన్ని అనుభవించామని...మా హక్కుల కోసం మరొక రోజు పోరాడ్డానికి వస్తామని అన్నారు. తమ నిరసనను, ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జంటలో ఒక్కరైన అనన్య కోటియా.

ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా భారతీయులు. వీరిద్దరూ విదేశాల్లో చదువుకున్నారు. అప్పటి నుంచే వీరికి పరిచయం ఉంది. 15ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను వివాహంగా మార్చుకోవాలని అనుకున్నారు. దాని కోసమే వారిద్దరూ కోర్టు మెట్లెక్కారు. వీరితో పాటూ మరో మూడు స్వలింగ సంపర్కుల జంట కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ముందు నిశ్చితార్ధం చేసుకున్న జంటలో అనన్య కోటియా రైటర్ కాగా, ఉత్కర్ష్ లాయర్ గా పని చేస్తున్నారు.

#marriage #supreme-court #act #same-sex
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe