Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో.. ఈసారి అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముమ్మర ప్రచారం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు. ఆదివారం నాడు నిర్మల్‌లో నిర్వహించిన జన జాతర సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన రాహుల్.. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమేనని పేర్కొన్నారు. తీము అధికారంలోకొస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని రాహుల్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం… రాహుల్ గాంధీ కీలక ప్రకటన
TG: దేశంలోని నిరుద్యోగులను మోడీ పట్టించుకోలేదని విమర్శించారు రాహుల్ గాంధీ. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 దినసరి కూలీ ఇస్తామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు.
Translate this News: