Kishan Reddy: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ ను రద్దు చేస్తామని అన్నారు. అరు నెలల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
TS: కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకం.. కిషన్ రెడ్డి

TS Elections: కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్లను (Muslim Reservation) రద్దు చేస్తామని అన్నారు. హై కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రిజర్వేషన్ల వల్ల మత మార్పిడులకు ప్రోత్సహించేందుకు ఈ రిజర్వేషన్లు ఉన్నాయని కోర్టు తీర్పులో ఉందని ఉద్గాటించారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును రద్దు చేసి దాన్ని ఎస్సీ, ఎస్టీలకు దక్కేలా చూస్తామన్నారు. ప్రభుత్వం కొలువులు ఇవ్వడంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అరు నెలల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని తెలిపారు.

ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని విమర్శించారు కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ 23 మంది బీసీలకు మాత్రమే టికెట్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున 39 మంది బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు. బీజేపీ పార్టీ మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తుందని.. మిగతా పార్టీలు వారిని ఓటు బ్యాంకుల్లా మాత్రమే చూస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని గతంలో బీజేపీ అధిష్టానం ప్రకటించినట్లు మరోసారి గుర్తు చేశారు.

ALSO READ: సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించిన చైనా

ఈ నెల 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రానున్నట్లు తెలిపారు. 18వ తేదీ వరంగల్, నల్గొండ, గద్వాల, రాజేంద్రనగర్ నియోజక వర్గాల్లో ఆయన పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. ఈరోజు తమని అనేక బీసీ సంఘాల నేతలు కలిశారని అన్నారు. వారు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున బీసీ సభలు సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు