Chandrababu:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్

నిన్న న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ అంతిమంగా గెలుస్తుంది అంటూ ఓ లేఖ బయటకు వచ్చింది. చంద్రబాబే ఈ లేఖను రాసినట్టు చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ లేఖను బాబు రాయలేదని...అది ఎవరో సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు.

New Update
Chandrababu:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్

నెలన్నర రోజులుగా జైల్లో ఉంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ట్రై చేస్తున్నా బెయిల్ మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 8,9 తేదీలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ నేఫథ్యంలో చంద్రబాబు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అంటూ రాసినట్టు నిన్న ఒక లేఖ బయటకు వచ్చింది. అయితే అది ఫేక్ అని...జైలు నుంచి అలాంటి లేఖ ఏదీ తాము జారీ చేయలేదని రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్. రాహుల్ స్పష్టం చేశారు.

Also Read:ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్-హమాస్

తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు బ‌హిరంగ లేఖ. నేను జైలులో లేను....ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్ర‌జ‌ల నుంచి న‌న్ను ఒక్క క్ష‌ణం కూడా ఎవ్వ‌రూ దూరం చేయ‌లేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని చెరిపేయ‌లేరు. ఆల‌స్య‌మైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తాను. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తాను. అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు' అని చంద్రబాబు పేరిట ఓ లేఖను టీడీపీ, ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు వైరల్ చేశారు.

అయితే ఆ కరపత్రము కారాగారము నుంచి జారీ చేయబడినది కాదు. కారాగార నియమావళి ప్రకారం.. ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన కరపత్రములు బయటకు విడుదల చేయదలచినచో, సదరు పత్రమును జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి సదరు పత్రముపై జైలరు ధృవీకరించి, సంతకం, కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు, కుటుంబసభ్యులకు పంపబడును. కావున పైన చూపబడిన కరపత్రమునకు, ఈ కారాగారమునకు ఏ విధమైన సంబంధము లేదని తెలియపరచుచున్నాము' అని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారము పర్యవేక్షణాధికారి స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు