/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-9-7.jpg)
Ibrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి సంబంధించి ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. ఇబ్రహీం హెలికాప్టర్ యాక్సిడెంట్ లో తమ ప్రమేయం ఏమీ లేదని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. ఇబ్రహీం రైసీ ప్రయాణించే హెలికాప్టర్ మే19న క్రాష్ అయి ఆయనతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, కొంతమంది అధికారులు మరణించారు. ఇరాన్ లోని తూర్పు అజర్ బైజాల్ ప్రాంతో చాపర్ యాక్సిడెంట్ కు గురైంది. అయితే ఈ ఘటనపై ఇరాన్ శ్రతు దేశమైన ఇజ్రాయిల్ స్పందిస్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయిల్ ప్రమేయం లేదని మీడియాతో వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/bd8eb703-ddf6-40a8-9b6b-9799ee456f52.jpg)
ఇక రైసీ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇరాన్ మంత్రివర్గం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.అతను తన దేశానికి సేవ చేయడంలో అంతిమ త్యాగం చేశాడని పేర్కొంది. దేశానికి వీరుడు. సేవకుడు. నాయకత్వానికి నమ్మకమైన స్నేహితుడు. అయతుల్లా రైసీ అలసిపోని స్ఫూర్తితో సేవా మార్గం కొనసాగుతుందని మా నమ్మకమైన విశ్వాసం' అని క్యాబినెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశాధినేతలు సైతం ఇబ్రహింకు నివాళి అర్పించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/d3610f41-e156-4b6a-b9bf-372a7627dc56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/f58c377b-6ff2-41d6-aa3b-bd3edb93d8e3.jpg)
Follow Us