/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Vande-jpg.webp)
Water Leakage in Vande Bharat: మోదీ ప్రభుత్వం భారత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పై ఇప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలు కోచ్‌లోని రూఫ్ నుంచి నీరు ధారగా కారిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే తీరుపై మండిడుతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజధాని నగరం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మధ్య నడిచిన వందే భారత్ రైలు (Delhi-Varanasi) నంబర్ 22416లోని ఒక కోచ్ పైకప్పు నుంచి వర్షపు నీరు కారింది. దీంతో సీట్లు తడిచిపోవడం, ఆ కోచ్ ఫ్లోర్ నీటితో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.కాగా, ఒక వ్యక్తి ఈ వీడియో క్లిప్‌ను ట్విటర్ లో షేర్ చేశాడు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ విషయం గురించి భిన్నంగా స్పందించారు. వందే భారత్ రైలు నిర్వహణ తీరు, కోచ్ నాణ్యతపై కొందరు మండిపడుతున్నారు. ‘షవర్‌తో కూడిన తొలి రైలు’ అని మరొకరు కామెంట్ చేశారు. వందే భారత్ రైలులో వసూలు చేస్తున్న ధర ఎక్కువగా ఉన్నప్పటికీ సేవలు లోపభూయిష్టంగా ఉన్నాయని కొందరు విమర్శించారు.
Vande Bharat TRAIN From Delhi to Varanasi experienced water leakage. Modi ki Guarantee 😂🤦♂️#4thofJuly#viralvideo #Varanasi #NewDelhi #DelhiAirport pic.twitter.com/OnUeUHAjwi
— Das Vanthala (@DasVanthala) July 4, 2024
మరోవైపు నార్తన్ రైల్వే దీని గురించి స్పందించింది. పైపుల్లో బ్లాక్ కారణంగా నీరు లీక్ అయినట్లు తెలిపింది. సిబ్బంది ఈ సమస్యను సరి చేసినట్లు వివరణ ఇచ్చింది. ప్రయణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు!