కృష్ణా నదిలో కృష్ణమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరే సారే సమర్పించి.. చంద్రబాబు నాయుడు త్వరితగతిన విడుదల కావాలని కొల్లు రవీంద్ర నాయకత్వంలో బీసీ విభాగం సంఘాలు పెద్ద ఎత్తున జలదీక్ష చేశారు. కృష్ణ గోదావరి నదుల అనుసంధానం చేసి పవిత్ర సంగమం చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు అని కోల్ల రవింద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి దీవెనలతో చంద్రబాబు నాయుడు తప్పకుండా బయటికి వస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నదుల అనుసంధానం చేసే కార్యక్రమం సాధ్యం కాదు. అటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారని కొల్లు గుర్తు చేశారు. కృష్ణా జలాలపై మనకున్న హక్కులను కోల్పోయామని ఆయన మండిపడ్డారు. భవిష్యత్ కాలంలో డెల్టా ప్రాంతం ఎడారిగా మారిపోతుందని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. సోమవారం న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం కొల్లు రవీంద్ర వ్యాఖ్యనించారు. కార్యకర్తలు కట్టుకున్నా.. డబ్బును అవినీతి డబ్బు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి శాశ్వత సమాధి కట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
This browser does not support the video element.
దేవినేని ఉమామహేశ్వర మాట్లాడుతూ.. గోదావరి తల్లీ నీళ్లను కృష్ణమ్మ తల్లిలో కలిపిన పవిత్రమైన ప్రాంతం ఇదన్నారు. 30 టీఎంసీలు గోదావరి తల్లి ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాయంటే నువ్వు ఎంత అసమర్థుడివో..? చేతగాని వాడివో..? అర్థం అవుతుందని విమర్శించారు. కృష్ణా జలాలపై 67 ఏళ్లగా మన హక్కులను మనం కాపాడుకుంటున్నామని గుర్తు చేశారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కిలోబడి అపెక్స్ కౌన్సిల్లో జగన్ నోరు తెరవకపోవడం వల్ల..., నీ అసమర్ధత చేతగానితనం వల్ల..., పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లోబడి కృష్ణా జలాలపై హక్కులను దారాదత్తం చేశావని సీఎం జగన్‌పై మండిపడ్డారు.
This browser does not support the video element.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ కూడా ఢిల్లీ మీడియా ముందు పెట్టలేదన్నారు. ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన కృష్ణా జలాలపై మన హక్కులను కోల్పోతుంటే.. నోరు తెరవ లేకపోవడం విడ్డూరంగా ఉందని దేవినేని ఉమామహేశ్వర్‌రావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉండి కూడా కృష్ణా జలాలపై మన హక్కులను కాపాడండి.. అందరూ కలిసి పోరాటం చేయండి.. ప్రతిపక్షాలను కలుపుకొని హక్కులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించమని చెప్పారని ఆయన తెలిపారు. ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేకపోయాడు. ఈ రోజు రాష్ట్రానికి వచ్చావు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పు జగన్ అంటూ సవాల్ చేశారు.
This browser does not support the video element.
ఇది కూడా చదవండి: కోటంరెడ్డికి కోపం వచ్చింది.. ఆ పనులు చేయాలంటూ ఆగ్రహం