Water Crisis: దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో 4 ఎండిపోగా, అందులో 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమీషన్ అంటే CWC డేటా ప్రకారం, వరుసగా 24వ వారంలో ప్రధాన రిజర్వాయర్లలో క్షీణత నమోదైంది. దక్షిణ భారతదేశంలోని మరో 10 రిజర్వాయర్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. వాస్తవానికి ఎల్‌నినో కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల పరిస్థితి క్లిష్టంగా మారింది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో జూన్ 2023 తర్వాత తక్కువ వర్షపాతం నమోదైంది. డేటా ప్రకారం, మొత్తం 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బిసిఎం) నిల్వ సామర్థ్యంలో 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 38 శాతం మాత్రమే ఉంది. అంటే 67.591 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే నీరు(Water Crisis) అందుబాటులో ఉంది.
దేశంలోని 104 రిజర్వాయర్లలో నీటి మట్టం నిల్వ సామర్థ్యంలో 50 శాతం కంటే తక్కువకు చేరుకోగా, 79 రిజర్వాయర్లలో నీటి మట్టం 40 శాతం కంటే తక్కువగా ఉందని కేంద్ర జల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం 40 శాతం దిగువ(Water Crisis)కు చేరుకుంది. వాతావరణ శాఖ ప్రకారం, మార్చి 1 నుండి దేశంలోని 710 జిల్లాల్లో 40 శాతంలో బలహీనమైన వర్షాలు లేదా అసలు వర్షాలు లేవు. జనవరి-ఫిబ్రవరిలో, 60 శాతం జిల్లాల్లో బలహీనమైన వర్షాలు లేదా వర్షాలు అసలు లేవు.
డేటా ప్రకారం, దక్షిణ భారతదేశంలోని రిజర్వాయర్లలో నీటి మట్టం 23 శాతానికి తగ్గింది. అంటే మొత్తం సామర్థ్యం 53.334 BCM లో 12.287 BCM. దక్షిణాది రాష్ట్రాల్లోని 42 రిజర్వాయర్లలో 30 రిజర్వాయర్లలో నీటిమట్టం 40 శాతం కంటే దిగువ(Water Crisis)కు పడిపోగా, 5 రిజర్వాయర్లలో నీటిమట్టం 50 శాతానికి దిగువకు చేరుకుంది. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని రిజర్వాయర్లలో నీటి మట్టం 33 శాతం అంటే 19.663 BCM మొత్తం నిల్వ సామర్థ్యంలో 6.439 BCMగా నమోదైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని దీనివలన నీటి నిలువలు పెరిగే అవకాశము ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ఆ విషయంలో జపాన్ ని మనోళ్లు మళ్ళీ తోక్కేస్తున్నారు
బెంగళూరులో తీవ్ర నీటి కొరత..
మరోవైపు బెంగళూరులో నీటికొరత(Water Crisis) తీవ్రంగా ఉంది. బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ ఏడాది వర్షపాతం నమోదుకాకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. గత వర్షాకాలంలో కర్ణాటకలో 18 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. గతేడాది 2015 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదైందని.. దీంతో బెంగళూరు నగరంలో భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోయి ప్రస్తుతం అడుగంటిపోయాయని(Water Crisis) వెల్లడించారు. సరిపడా వర్షాలు కురవకపోవడంతో కావేరీ నదిలో నీటిమట్టం బాగా తగ్గిపోవడంతో తాగు, సాగునీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి ప్రస్తుతం బెంగళూరు నగరంలో సగం బావులు(Water Crisis) ఎండిపోయాయి. బెంగళూరులోని నీటి సమస్యపై ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో చాలా భిన్నమైన భూగర్భ వ్యవస్థలు ఉన్నాయి. అందుకే దక్షిణ భారతదేశంలో భూగర్భ జలాల్లో అంతగా నీరు ఉండదని ప్రొఫెసర్ విమల్ మిశ్రా వెల్లడించారు. దీని కారణంగా, దక్షిణాన భూగర్భంలో ఎక్కువ నీటిని నిల్వ చేయలేరు. ఉత్తర భారతం అయితే పరిస్థితి మరోలా ఉంటుందని మిశ్రా అన్నారు. భూగర్భ జలాల్లో ఎక్కువ నీటిని నిల్వ(Water Crisis) చేసుకునే సామర్థ్యం ఉంటుందన్నారు. అందుకే బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గతేడాది కర్ణాటక కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, అయితే ఆ రాష్ట్రాల్లో కర్ణాటక పరిస్థితి కనిపించడం లేదని వివరించారు.