Video Viral: అపార్ట్‌మెంట్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌ చేసిన పని చూడండి

ఓ డెలివరీ బాయ్‌ అపార్ట్‌మెంట్‌లోకి ఫుడ్‌ డెలివరీకి వచ్చి చేసిన నిర్వాకం అందరినీ ఔరా అనిపిస్తోంది. ఆ వ్యక్తి మొదట వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి ముఖం తుడుచుకుని మళ్లీ వెనక్కి వచ్చి అక్కడ ఉన్న చెప్పుల జత కొట్టేశాడు. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Video Viral: అపార్ట్‌మెంట్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌ చేసిన పని చూడండి

Video Viral: ఈ మధ్యకాలంలో ఆహారం దగ్గరి నుంచి వస్తువులు, సరుకులు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు. ఏదైనా ఇంటి ముందుకు రావాల్సిందే. ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు కూడా ఇష్టపడరు. డెలివరీ కోసం డోర్‌ తెరిచారంటే చాలు మళ్లీ బయట ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఇదే అదునుగా ఓ డెలివరీ బాయ్‌ చేసిన నిర్వాకం అందరినీ ఔరా అనిపిస్తోంది.

ఓ డెలివరీ బాయ్‌ అపార్ట్‌మెంట్‌లోకి ఫుడ్‌ డెలివరీ తీసుకొచ్చాడు. కాలింగ్‌ బెల్‌ కొట్టగానే ఓ మహిళ అతిని దగ్గర పార్శిల్‌ తీసుకుని లోపలికి వెళ్లి డోర్‌ వేసుకుంది. అటూఇటూ చూసిన ఆ వ్యక్తి మొదట వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి ముఖం తుడుచుకుని మళ్లీ వెనక్కి వచ్చి అక్కడ ఉన్న మూడు జతల చెప్పుల్లో ఒక జత కొట్టేశాడు. తన దగ్గర ఉన్న టవల్‌లో దాచుకుంటూ దర్జాగా వెళ్లిపోయాడు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

publive-image

స్విగ్గీ పికప్‌లు ఎప్పుడు మొదలు పెట్టింది..ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటే ఇదేనేమో అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఏప్రిల్ 11, 2024న పోస్ట్ చేసినప్పటి నుంచి పోస్ట్‌కి ఇప్పటివరకు 716K వ్యూస్‌ వచ్చాయి. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లో జరిగిందని తెలుస్తోంది. అయితే Swiggy అధికారిక హ్యాండిల్ నుంచి వీడియోకి రిప్లే వచ్చింది. మేం మా కస్టమర్‌ మంచిని కోరుకుంటాం. ఏదైనా పొరపాటు జరిగితే చింతిస్తున్నాం. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: కోపం, అహం తగ్గించుకోవడానికి చిన్న చిట్కాలు..ఫాలో అవ్వండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు