Watch Video: ఇంత అందంగా అమ్మాయి కూడా అలగదేమో.. క్యూట్ వీడియో అస్సలు మిస్సవ్వొద్దు..!

చిన్న పిల్లలు అలగడం చూశాం.. అమ్మాయిలు అలగడం చూశాం.. భార్యలు అలగడం చూశాం.. కానీ, పిల్లి అలగడం ఎప్పుడైనా చూశారా? అలిగి తన ముఖాన్ని కూడా చూయించనంటూ మారాం చేయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా పిల్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యజమానిపై అలిగిన పిల్లి ముఖం కూడా చూపలేదు.

New Update
Watch Video: ఇంత అందంగా అమ్మాయి కూడా అలగదేమో.. క్యూట్ వీడియో అస్సలు మిస్సవ్వొద్దు..!

Viral Video: చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటారు. ఎక్కువ శాతం కుక్కలను పెంచుకుంటారు. రకరకాల బ్రీడ్స్‌కు చెందిన కుక్కలు ఉంటాయి. అలాగే.. మరికొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. చిన్న చిన్న పిల్లి కూనలు చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇక అవి చేసే అల్లరి ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ సాదు జంతువుల కారణంగా ప్రజల మానసికంగానూ ఆనందంగా ఉంటారు. అందుకే.. ఎక్కువగా కుక్కలు, పిల్లులను తమ ఇళ్లలో పెంచుకుంటారు. అయితే, తాజాగా ఓ పిల్లికి సంబంధించిన మోస్ట్ బ్యూటీఫుల్, హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది.

చాలా సందర్భాల్లో చిన్న పిల్లలు అలిగడం, మారాం చేయడం చూస్తూనే ఉంటాం. ఇక ప్రియుడిపై ప్రేయసి అలక, భర్తపై భార్య అలక కామన్. పిల్లలు, అమ్మాయిలు అలిగిన సందర్భంలో ఎంతో అందంగా, క్యూట్‌గా కనిపిస్తారు. 'నేను అలిగాను.. బుంగ మూతి పెట్టుకున్నాను' అంటూ కొన్ని సినిమాల్లో డైలాగ్స్ కూడా ఉన్నాయి. మరి పిల్లి అలిగి బుంగ మూతి పెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే.. ఇప్పుడు చూసేయండి. ఇంత క్యూట్ వీడియోను అస్సలు మిస్సవ్వకండి.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లి తన ముందరి కాళ్లను ముఖానికి అడ్డుగా పెట్టుకుని అలకపాన్పు ఎక్కింది. బోర్లా పడుకున్నా పిల్లి.. తన ముఖాన్ని ముందరి కాళ్లతో కప్పేసింది. ఇంతలో యజమాని వచ్చి.. దానిని లేపే ప్రయత్నం చేసింది. బతిమాలింది.. బుజ్జగించింది.. అయినా అలక వీడను పో అంటూ అందమైన రియాక్షన్స్ ఇచ్చింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read:

రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..!

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు