Modi Elephant Swari : ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అసోం(Assam), అరుణాచల్ ప్రదేశ్ టూర్(Arunachal Pradesh) లో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా మోదీ ఇవాళ(మార్చి 9) ఉదయం కజిరంగా నేషనల్ పార్క్(Kaziranga National Park) కు చేరుకున్నారు. ఈ సమయంలో ఏనుగు స్వారీతో పాటు జీపు కూడా ఎక్కారు. ఇక మోదీ నిన్న సాయంత్రం తేజ్‌పూర్ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ(Assam CM Himanta Biswa Sharma) ఆయనకు స్వాగతం పలికారు. రాత్రి విశ్రాంతి తర్వాత కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఇక మోదీ ఇక్కడి నుంచి ఇటానగర్‌కు వెళ్లనున్నారు.
రూ. 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన:
కజిరంగా విజిట్‌లో మోదీ మొదట పార్క్‌లోని సెంట్రల్ కోహోరా రేంజ్‌లోని మిహిముఖ్ ప్రాంతంలో ఏనుగు సఫారీ(Elephant Safari) ని తీసుకున్నారు. ఆ తర్వాత జీప్ సఫారీకి వెళ్లారు. ఆయన వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ అధికారులు కూడా ఉన్నారు. ఈ మధ్యాహ్నం జోర్హాట్‌లో ప్రఖ్యాత అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 'శౌర్య' విగ్రహాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఇది 125 అడుగుల ఎత్తైనది. ఆ తర్వాత జోర్హాట్ జిల్లాలోని మెలెంగ్ మెటెల్లి పోతార్‌ను సందర్శించనున్న మోదీ.. అక్కడ దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రారంభిస్తారు. వీటిలో శంకుస్థాపన చేసేవి కూడా ఉన్నాయి. అదే స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశం:
కజిరంగా జాతీయ ఉద్యానవనం అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్-నాగావ్ జిల్లాల్లోని జాతీయ ఉద్యానవనం . ప్రపంచంలోని మూడింట రెండు వంతుల భారతీయ ఖడ్గమృగాలకు ఆతిథ్యం ఇచ్చే ఈ పార్క్ UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొందింది. మార్చి 2018లో అస్సాం ప్రభుత్వ అటవీ శాఖ డేటా ప్రకారం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగాల సంఖ్య 2,613. ఈ ఉద్యానవనం అనేక చిన్న నీటి వనరులను కలిగి ఉంది.
Also Read : విద్యార్ధులకు సూపర్ న్యూస్..ఇక మీదట ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు