Wasim Akram shocked by snubbing of Imran Khan in independence day video: పాకిస్థాన్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన ఆటగాడు ఇమ్రాన్‌ఖాన్. 1992 ప్రపంచ కప్‌లో పాక్ వరుస పెట్టి మ్యాచ్‌లు ఓడిపోతున్నా.. వెన్ను చూపని సారధిగా ఆటగాళ్లలో స్పూర్తి నింపి జట్టుకు ట్రోఫీని అందించాడు. ఇమ్రాన్‌ఖాన్ లేకపోతే అసలు ప్రపంచ్ కప్ వచ్చేదే కాదని ఇప్పటికీ అప్పటి పాకిస్థాన్ టీమ్ ప్లేయర్లు అనేకసార్లు..చాలా సందర్భాల్లో చెప్పారు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని.. అసలు సిసలైన కింగ్ అతనే అంటూ క్రికెట్ పండితులు కీర్తిస్తూ ఉండేవాళ్లు. అలాంటి ఇమ్రాన్‌ఖాన్‌ని ప్రపంచ క్రికెట్ గుర్తించినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) మాత్రం కూరలో కరివేపాకులా తీసిపడేసింది.
పాక్ బోర్డు ఏం చేసిందంటే?
పాక్ ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 14) సందర్భంగా పీసీబీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పాకిస్థాన్ క్రికెట్ గొప్పతనాన్ని చూపించే వీడియో అది. పాక్ క్రికెట్ సాధించిన ఘనతల్లో వరల్డ్ కపే అన్నిటికంటే ప్రధానమైనది. అంతకంటే పాక్ క్రికెట్ గొప్పగా సాధించింది ఏమీ లేదు. 2009లో టీ20 వరల్డ్ కప్ గెలిచినా మాట నిజమేనైనా.. అది 1992 ప్రపంచ కప్ కంటే గొప్ప విషయం కాదు. అలాంటిది 1992 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన ఇమ్రాన్ని వీడియోలో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడిదే ప్రశ్నను సంధిస్తున్నారు పాక్ మాజీ క్రికెటర్లు.