బుద్ధి ఉందా? ఇమ్రాన్‌ఖాన్‌కి జరిగింది ముమ్మాటికి అన్యాయమే!

పాకిస్థాన్‌ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పీసీబీ(PCB) రిలీజ్‌ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్‌, యార్కర్‌ కింగ్‌ వసీం అక్రమ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్‌ క్రికెట్ గొప్పతనాన్ని చూపించే వీడియోలో ఇమ్రాన్‌ఖాన్‌ ఎందుకులేడో తనకు అర్థంకాలేదని ఫైర్ అయ్యాడు. పీసీబీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. 1992లో పాక్‌ జట్టుకు ప్రపంచ్‌ కప్‌ అందించింది ఇమ్రాన్‌ఖానేనన్న విషయం మరువద్దన్నాడు ఇమ్రాన్‌ఖాన్. ప్రస్తుతం 'తోషాఖాన' కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ని కావాలనే పీసీబీ వీడియోలో లేకుండా చేసిందని సమాచారం.

New Update
బుద్ధి ఉందా? ఇమ్రాన్‌ఖాన్‌కి జరిగింది ముమ్మాటికి అన్యాయమే!

Wasim Akram shocked by snubbing of Imran Khan in independence day video: పాకిస్థాన్‌ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన ఆటగాడు ఇమ్రాన్‌ఖాన్‌. 1992 ప్రపంచ కప్‌లో పాక్‌ వరుస పెట్టి మ్యాచ్‌లు ఓడిపోతున్నా.. వెన్ను చూపని సారధిగా ఆటగాళ్లలో స్పూర్తి నింపి జట్టుకు ట్రోఫీని అందించాడు. ఇమ్రాన్‌ఖాన్‌ లేకపోతే అసలు ప్రపంచ్‌ కప్‌ వచ్చేదే కాదని ఇప్పటికీ అప్పటి పాకిస్థాన్‌ టీమ్‌ ప్లేయర్లు అనేకసార్లు..చాలా సందర్భాల్లో చెప్పారు. కెప్టెన్‌ అంటే ఇలా ఉండాలని.. అసలు సిసలైన కింగ్‌ అతనే అంటూ క్రికెట్‌ పండితులు కీర్తిస్తూ ఉండేవాళ్లు. అలాంటి ఇమ్రాన్‌ఖాన్‌ని ప్రపంచ క్రికెట్ గుర్తించినా.. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు(PCB) మాత్రం కూరలో కరివేపాకులా తీసిపడేసింది.


పాక్‌ బోర్డు ఏం చేసిందంటే?
పాక్‌ ఇండిపెండెన్స్‌ డే(ఆగస్టు 14) సందర్భంగా పీసీబీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. పాకిస్థాన్‌ క్రికెట్ గొప్పతనాన్ని చూపించే వీడియో అది. పాక్‌ క్రికెట్‌ సాధించిన ఘనతల్లో వరల్డ్‌ కపే అన్నిటికంటే ప్రధానమైనది. అంతకంటే పాక్‌ క్రికెట్‌ గొప్పగా సాధించింది ఏమీ లేదు. 2009లో టీ20 వరల్డ్ కప్‌ గెలిచినా మాట నిజమేనైనా.. అది 1992 ప్రపంచ కప్‌ కంటే గొప్ప విషయం కాదు. అలాంటిది 1992 ప్రపంచ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ అయిన ఇమ్రాన్‌ని వీడియోలో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడిదే ప్రశ్నను సంధిస్తున్నారు పాక్‌ మాజీ క్రికెటర్లు.


ఇది కరెక్ట్ కాదు:
పీసీబీ రిలీజ్ చేసిన వీడియో క్లిప్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ లేకపోవడాన్ని ఆ జట్టు మాజీ ఆటగాడు.. బౌలింగ్‌ లెజెండ్ వసీం అక్రమ్‌ తప్పుపట్టాడు. వీడియో చూసి షాక్‌కు గురయ్యానని చెప్పారు. క్రికెట్‌ని క్రికెట్‌లాగే చూడాలని.. అవసరంమైన సమయంలో విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌కు చిహ్నమని.. పాక్‌ని బలమైన జట్టుగా నిలపడంలో అతని పాత్ర మరవలేనిదన్నారు. పీసీబీ రిలీజ్ చేసిన వీడియోను వెంటనే తొలగించాలని.. బోర్డు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు అక్రమ్‌. అటు ఫ్యాన్స్‌ కూడా పీసీబీ వీడియోపై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో "#ShameOnPCB" హ్యాష్‌ట్యాగ్‌లతో విమర్శలతో ముంచెత్తాయి. పీసీబీని విమర్శించిన వారిలో మాజీ మహిళా క్రీడాకారిణి ఉరూజ్ ముంతాజ్ కూడా ఉన్నారు. వీడియో నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను తప్పించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 'తోషాఖాన' కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్‌ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు