Telangana News: భలే ఐడియా బాసూ.. ఆర్టీసీ బస్సులో మర్చిపోయిన పందెం కోడిని ఏం చేస్తున్నారో తెలుసా?

వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతోన్న ఆర్టీసీ బస్సులోని ఓ వ్యక్తి జనవరి 9న ఓ బ్యాగ్‌ మరిచిపోయాడు. ఆ బ్యాగ్‌లో పందెం కోడి ఉంది. ఎన్నిరోజులైనా ఆ కోడిని తీసుకోని వెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో రేపు ఆ కోడిని వేలం వెయ్యనున్నారు డిపో అధికారులు.

Telangana News: భలే ఐడియా బాసూ.. ఆర్టీసీ బస్సులో మర్చిపోయిన పందెం కోడిని ఏం చేస్తున్నారో తెలుసా?
New Update

జనవరి 09, 2024.. ఓ టీఎస్‌ఆర్టీసీ బస్సు వరంగల్(Warangal) నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) వెళుతోంది. దారిలో కరీంనగర్‌(Karimnagar) బస్‌ స్టాప్‌ వద్ద ఆగింది. ఓ వ్యక్తి బస్సులో బ్యాగ్‌ను మరిచిపోయి దిగి వెళ్లిపోయాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని కండక్టర్‌ దృష్టికి తిసుకెళ్లారు. కండక్టర్ ఈ బ్యాగ్‌ను కరీంనగర్‌ డిపోకు పంపించారు. మరిచిపోయిన వ్యక్తి కరీంనగర్‌లోనే మర్చిపోవడంతో అక్కడి డిపోకే సంబంధిత వ్యక్తి వస్తాడని భావించారు. అయితే ఎంతసెపైనా బ్యాగ్‌ తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అందులో ఏముందోనన్న ఆసక్తి ఆర్టీసీ సిబ్బందిలో నెలకొంది.

publive-image

బ్యాగ్‌ తెరిచి చూస్తే కోడి:

కాసేపటికి ఆ బ్యాగ్‌లో ఏముందోనని జిప్‌ తీసి చూశారు. వెంటనే షాక్‌ అయ్యారు.. కొక్కరకో అంటూ ఓ కోడి కనిపించింది. అది కూడా మాముల కోడి కాదు.. బరిలో ప్రత్యర్థులను చిత్తు చేయాలనే కసితో ఉన్న పందెం కోడి. బస్సు సిబ్బందికి దాన్ని చూడగానే పాపం అనిపించింది. ఎందుకంటే అది ఆకలితో ఉంది. ఓనర్‌ వచ్చేలోపు దాన్ని సంరక్షిద్దామని కోడికి కావాల్సినివ పెట్టారు.. రెండు రోజులు గడిచింది. అయినా బ్యాగ్‌ మరిచిపోయిన వ్యక్తి రాలేదు. మరోవైపు కోడి తనకు కావాల్సింది లాగించేస్తోంది. ఇక ఏం చేయాలో అర్థం అవ్వలేదు బస్సు సిబ్బందికి.

ఏం ఆలోచించారంటే..!

ఓవైపు కోడిని మేపడం కష్టంగా అనిపించింది. ఇంతలోనే డిపో అధికారులకు ఓ ఆలోచన వచ్చింది. ఆ పందెం కోడిని వేలం వెయ్యలన్న థాట్‌ వచ్చింది. సంస్థకు ఆదాయంతో పాటు కోడిని కూడా వదిలించుకునే అవకాశం ఇదేనని అనిపించింది. సంక్రాంతి వెళ్లిపోతే మళ్లీ కోడి కోనేందుకు ఎవరూ రారు.. అందుకే రేపు(జనవరి 12)న కరీంనగర్‌ బస్‌ డిపోలోనే పందెం కోడిని వేలం వెయ్యనున్నారు.

Also Read: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు..

WATCH:

#warangal #karimnagar #sankranthi-2024 #pongal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe