Note For Vote Case: రేపు సుప్రీంలో 'ఓటుకు నోటు' కేసు విచారణ

2015లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Note For Vote Case: రేపు సుప్రీంలో 'ఓటుకు నోటు' కేసు విచారణ
New Update

Note For Vote Case: 2015లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై రేపు సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి (CBI) అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: అలా చేస్తే నా కొడుకుని ఉరితీయండి.. మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

అసలేంటి ఈ కేసు..

2015లో ఈ కేసు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామంటూ తెలంగాణ ఏసీబీ ఓ వీడియో విడుదల చేసింది. ఆ విడియోలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఓ ఆడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఆ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఆ డబ్బులను చంద్రబాబే పంపించాడని ఆరోపించారు వైసీపీ, నాటి టీఆర్ఎస్ నేతలు. అయితే.. ఈ సంచలన కేసు రాను రాను సైలెంట్ అయిపోయింది. అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పై బయటకు వచ్చారు.

సీఎం రేవంత్ కు నోటీసులు..

పార్లమెంటు ఎన్నికల వేళ ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.

#cm-revanth-reddy #chandrababu #ycp-mla-alla-ramakrishna-reddy #note-for-vote-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe