Volunteer Raped Minor Girl: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య ఏపీ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్ల కేసులు, వాలంటీర్ల వేధింపులు అంటూ చాలా ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఘటన మళ్లీ ఇప్పుడు వాలంటీర్ రేప్ కేసు అంటూ కలకలం రేపుతోంది. పవన్ చెప్పినట్టే ఇంట్లో ఎవరు లేని టైంలో ఆధార్ కార్డ్ కోసం వెళ్లి ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నీలాపు శివకుమార్. ఆ తర్వాత పలుమార్లు బాలికను బెదిరించి అదేపని చేశాడు.. ఆ బాలిక గర్భవతి కావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. తప్పించుకోవాలని చూసినా శివకుమార్ గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టడంతో చివరకు పెళ్లికి ఒప్పుకున్నాడు. తీరా పెళ్లి ముందు రోజు వాలంటీర్ పరారయ్యాడు. తాజాగా ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరులో వెలుగులోకి చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్ ఊరు వదిలి పారిపోయాడు.
చెబితే చంపేస్తానంటూ బెదిరింపు
జరిగిన వివరాలను పరిశీలిస్తే.. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో ఓ బాలికను నీలాపు శివకుమార్ అనే వలంటీర్ వెంటపడి వేధించేవాడు. రెండునెలల క్రితం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కావాలని ఇంటికి వెళ్లి 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ తర్వాత బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దసరా పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవులు రావడంతో బాలిక తన పెద్దమ్మ ఊరికి వెళ్లింది. అక్కడ బాలికకు వైద్యపరీక్షలు చేయించగా గర్భవతి నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వాలంటీర్ ను నిలదీశారు. దీంతో రూ.10 వేలు ఇస్తాను కడుపు తీయించుకోవాలని వాలంటీర్ నీలాపు శివకుమార్ చెప్పాడు.
వైసీపీ నేత అండ ఉండటంతో..
ఈ విషయంతో రెండు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. చివరకు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాక పెళ్లికి ముందు రోజు శివకుమార్ పరారయ్యాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులు ఏలూరులో దిశ పీఎస్‌కు వెళ్లగా అధికారులు లేరంటూ ఫిర్యాదు తీసుకోలేదు. చేసేదేమి లేక.. దెందులూరు పీఎస్‌కు వెళ్లినా.. అక్కడ కూడా కేసు నమోదు చేయలేదు. పోలీసులు పట్టించుకోకపోవటంతో జగనన్నకు చెబుదాం.. స్పందన.. 112కు బాధితులు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు ఈనెల (అక్టోబరు) 5న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కాలయాపనపై పోలీసులను బాలిక బంధువులు అడిగారు. మీరే నిందితుడిని వెతికి పట్టుకొస్తే తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. వాలంటీరుకు స్థానిక వైసీపీ నేత అండ ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదుకు కూడా తీవ్ర జాప్యం చేశారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్