PM Modi:పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్

New Update
PM Modi:పండుగకు దేశీ ఉత్పత్తులనే వాడండి..ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్

దీపావళికి, ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువులతో సెల్ఫీలు తీసుకుని, వాటిని నమోయాప్‌లో అప్‌లోడ్ చేయాలంటూ ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది దీపావళిని భారతదేశ సృజనాత్మక స్ఫూర్తితో, వ్యాపార సామర్థ్యంతో జరుపుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. మన దగ్గరే తయారైన ఉత్పత్తులతో పండుగ జరుపుకోవాలని మోదీ చెప్పారు. అలా కొనుక్కున్నవారు అందరూ సెల్ఫీలు తీసుకుని నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఇందులో తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి,భారతదేశ సంప్రదాయాన్ని పెంపొందించడానికి డిజిటల్ మీడియా శక్తిని ఉపయోగిస్తామని ప్రధాని ట్వీట్ చేశారు.

Also Read:ఈరోజే పొలిటికల్ స్టార్ల నామినేషన్.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, ఈటల

ప్రధాని మోదీ పోస్ట్ కు ఫుల్ వైరల్ అవుతోంది. పోస్ట్ చూసిన నెటిజన్లు తాము ఇప్పటికే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేశామని కామెంట్లు చేస్తున్నారు. వెంటనే ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. గత నెలలో మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను గతంలో ఇచ్చిన పిలుపు కారణంగానే దసరా పండుగకు దేశ ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారన్నారు. ఈ స్ఫూర్తితో మన దేశంలో తయారైన ఉత్పత్తులను ప్రతి పండుగ రోజు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ఇది గొప్ప బలం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు. లోకల్ ఫర్ వోకల్ నినాదానికి మద్దతుగా ఈ దీపావళికి దేశ ప్రజలందరూ స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

Also Read:నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ

Advertisment
తాజా కథనాలు