Visakha Harbour Fire Incident: విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్..సీసీ ఫుటేజ్ విడుదల! ఏపీ విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని అధికారులు విడుదల చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు పారిపోతూ కనిపించారు. వారు ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 25 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Visakha Harbour Fire Incident CCTV Footage: ఏపీ విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బొట్లు కొన్ని పూర్తిగా దగ్ధం కాగా..మరికొన్ని పాక్షికంగా దెబ్బ తిన్నాయి. బోట్లు నష్టపోయిన వారందరికీ కూడా ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం జగన్ (CM Jagan) హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటన గురించి సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బయటకు పారిపోతున్నట్లు కనిపిస్తుంది. వారిద్దరే ఈ ప్రమాదానికి కారణమా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటీ..? ఎవరన్నా కావాలనే బోట్లను తగలబెట్టారా? ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజీ విడుదల చేయడం వల్ల ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఇందులో కనిపిస్తున్న ఇద్దరూ కూడా హార్బర్ నుంచి భయంతో కంగారుగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుంది. వారిద్దరూ రాత్రి 10.49 నిమిషాలకు బయటకు రాగా..10.50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందు ఈ ప్రమాదం జరిగినప్పుడు యూట్యూబర్ లోకల్ బాయ్ నాని (Local Boi Nani) పై ముందు ఆరోపణలు వచ్చాయి. మిత్రులతో పార్టీ చేసుకుంటున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని ఆ తరువాత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడని వార్తలు వచ్చాయి. దీని గురించి లోకల్ బాయ్ నాని వివరణ ఇచ్చారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఆగిప్రమాదానికి తనకూ ఏ మాత్రం సంబంధం లేదని లోకల్ బాయ్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నాడు. 19వ తేదీ రాత్రి తన భార్య సీమంతం కావడంతో వేరే ప్లేస్ లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చానని తెలిపాడు. అయితే, ఆ సమయంలోనే తనకు ఫోన్ రావడంతో యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్లనని చెప్పాడు. అయితే, తాను అక్కడికి వెళ్లే సరికి బోట్లు అన్ని తగలబడిపోతున్నాయన్నాడు. అది చూసి ఏడ్చుకుంటూ నేరుగా తన బోటు దగ్గరకు వెళ్లానని వివరించాడు. తనకు రెండు బోట్ల ఉన్నాయని వెల్లడించాడు. అందులో ఒకటి కాలిపోతుండగా.. ఇంకో బోటు సేఫ్ గా ఉందని తెలిపాడు. ‘నేను డ్రింక్ చేసింది వాస్తవమే అది నేను ఒప్పుకుంటాను. నా భార్య శ్రీమంతం కావడంతో నేను తాగాను. తాగిన మైకంలో ఉన్న నేను..తగలబడిపోతున్న బోట్లను ఎలా సేవ్ చేసేది? ఒకవేళ నేను సేవ్ చేయడానికి వెళ్తే మళ్లీ నన్ను సేవ్ చేయడానికి ఇంకోకరు రావాల్సి ఉంటుంది. నేను ఉన్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు. ఈ ప్రమాదం జరిగిందని ఎవ్వరికి కూడా తెలియదు.. కనీసం వీడియో తీస్తే గవర్నమెంట్ కు తెలుస్తుంది.. ప్రజలు జరిగిన విషయం తెలుసుకుంటారు…నష్టపోయిన మమ్మలిని ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశం తోనే వీడియో తీశాను తప్పా…యూట్యుబ్ లో పెట్టాడానికి కాదు’ అని అన్నాడు. అంతేకానీ, ఆ వీడియోను క్యాష్ చేసుకోవడానికి ఏ మాత్రం కాదని స్పష్టం చేశాడు నాని. Also read: పాతబస్తీలో ఐటీ దాడులు..బడా వ్యాపారులే టార్గెట్! #ap #vizag #visakha-harbour-fire-incident #local-boi-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి