IT Raids In Hyderabad: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు రాష్ట్రంలో వరుసగా దాడులు చేస్తున్నారు. నిత్యం ఏదోక ప్రాంతంలో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ తాజాగా నగరంలోని పాతబస్తీలోని బడా వ్యాపారులను టార్గెట్ గా దాడులు నిర్వహిస్తున్నారు. కింగ్ ప్యాలెస్ (Kings palace) యజమానులతో పాటు, కోహీనూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ (Majid Khan) ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..షానవాజ్ ఇంటితో పాటు పలువురి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. కోహినూర్ , కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లలో ఫంక్షన్లు నిర్వహిస్తున్న వీరు ఓ రాజకీయ పార్టీకి భారీగా నగదు సమకూర్చుతున్నట్లు సమాచారం రావడంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది మే నెలలో కూడా పాతబస్తీ తో పాటు దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ గ్రూప్ నకు చెందిన అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
Also read: హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి కుమారుడు!
[vuukle]