Vizag Court : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ఈరోజు విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు దళితులను హింసించి వారిలో ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటనపై 28 ఏళ్ల విచారణ తర్వాత నేడు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమాన విధించింది. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 2019 వరకు 148సార్లు కేసు వాయిదా తర్వాత నిరవధికంగా విచారణ కొనసాగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు తాజాగా కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో న్యాయం జరగడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే