/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/vivo-V30-Pro-1-jpg-jpg.webp)
Vivo V30 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్(Smart Phone) కంపెనీ అయినా వివో తన వివో వీ30 ప్రో(Vivo V30 Pro) స్మార్ట్ ఫోన్ ఈనెలలో లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 28న లాంచ్ అవుతుందని లీక్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ మద్యే వీవో వీ30స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్‌కు ముందు, హ్యాండ్‌సెట్‌లో 3డి కర్వ్డ్ డిస్‌ప్లే(3D Curved Display) ఉంటుందని, కెమెరాలో జీస్ లెన్స్ ఉంటుందని వివో వెల్లడించింది. వివో వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీ ప్రకారం, వివో వీ30 ప్రో ఫిబ్రవరి 28న థాయ్‌లాండ్‌లో విడుదల కానుంది. లాంచ్ చేయబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెక్స్, ఫీచర్లు, కెమెరా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వివో వీ30 ప్రో లాంచ్ తేదీ:
వివో వెబ్‌సైట్ ల్యాండింగ్ పేజీ ప్రకారం, వివో వీ30 ప్రో ఫిబ్రవరి 28న థాయ్‌లాండ్‌లో లాంచ్ కానుంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్(Pre-Order) చేసే వారు ఎర్లీ బర్డ్ ప్రోగ్రామ్(Early Bird Program) లో భాగమవుతారు. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్‌లో ఈ డివైస్ లాంచ్ అవుతుందని టెక్ దిగ్గజం వెల్లడించింది.వివో వీ30 ప్రో ఫీచర్లు డిసెంబర్ 2023లో చైనాలో ప్రారంభించిన వివో ఎస్ 18 ప్రో పోలి ఉన్నాయి.
స్పెసిఫికేషన్:
ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్‌లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లోని మూడు లెన్స్‌లు జీస్‌కు చెందినవే కావడం గమనార్హం. అదనంగా, ఇది కెమెరా క్రింద 'ఆరా' లైట్‌ను కూడా పొందుతుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఫోటోగ్రఫీ కోసం కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ధర:
వివో గత నెలలో భారతదేశంలో తన తాజా X100 సిరీస్‌ను అధికారికంగా ప్రారంభించింది. కొత్త హ్యాండ్‌సెట్‌లు, Vivo X100, X100 Pro, MediaTek శక్తివంతమైన డైమెన్సిటీ 9300 SoC చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతున్నాయి. వివో అదనంగా, Vivo X100 రూ. 63,999 నుండి ప్రారంభమవుతుంది. X100 ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో పరిచయం అయ్యింది.
ఇది కూడా చదవండి : రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు