Viveka Murder Case : పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు..ఎందుకంటే!

వివేకా హత్య కేసులో వివేకా కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారని, వివేకా మాజీ పీఏ కృష్ణా రెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వారి పై కేసు నమోదు చేయాలని తెలిపింది.

New Update
Viveka Murder Case : పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు..ఎందుకంటే!

ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Vivekananda reddy) హత్య కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ కేసులో నిన్నటి వరకూ ఈ కేసులో దర్యాప్తు అధికారికగా ఉన్న సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ (Cbi Sp) (Ramsingh)తో పాటు వివేకా కూతురు సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి లపై కేసు నమోదు చేయాలని పులివెందుల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

వివేకా హత్య కేసులో ఆయన మాజీ పీఏ కృష్ణారెడ్డిని(Krishna reddy) సీబీఐ పదేపదే విచారణ పేరుతో వేధిస్తుండడంతో ఆయన పోలీసులతో పాటు పులివెందుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన కోర్టు వివేకా కూతురు సునీతా తో పాటు ఆమె భర్త రాజశేఖర్‌ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పులివెందుల పోలీసులు వారి ముగ్గురి మీద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పీఏ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..ఈ కేసు గురించి వీరు ముగ్గురు తనని బెదిరిస్తున్నారని..తాము చెప్పిన నేతల పేర్లు పోలీసుల ముందు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని కృష్ణారెడ్డి ఆరోపించారు.

కొందరు నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ హత్య కేసులో వారి ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలంటూ ఎస్పీ రాంసింగ్‌ వేధిస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులు చెప్పినట్లు వినాలని వివేకా కూతరు, అల్లుడు తన మీద విపరీతమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో పిటిషన్‌ వేసినట్లు ఆయన వివరించారు.

దీంతో పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు. ఎస్పీ రాంసింగ్‌ పై కేసు నమోదు కావడంతో సర్టిఫైడ్‌ ప్రతుల కోసం కోర్టుకు వచ్చిన పులివెందుల పోలీసు అధికారులు.

Also read: మరో 50 మంది ఎంపీలు ఔట్.. స్పీకర్ సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు