Hero Wife: నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను..వెల్లడించిన హీరో భార్య!

నటి వితికా షేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఆమె ఛానెల్‌ లో తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్‌ కొంచెం కంగారు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వితికా స్పాండిలైటిస్‌, మైగ్రేన్‌ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

Hero Wife: నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను..వెల్లడించిన హీరో భార్య!
New Update

హ్యాపీడేస్‌ సినిమా ద్వారా యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న నటుడు వరుణ్‌ సందేశ్‌. తరువాత కొత్త బంగారు లోకంతో మరింత పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినీ ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడనే చెప్పుకొవచ్చు.

కొంత కాలం క్రితం బిగ్‌ బాస్ షోలో భార్య, నటి వితికా షేరుతో కలిసి సందడి చేశాడు. వితికా కూడా నిత్యం అభిమానులతో సోషల్‌ మీడియా ద్వారా టచ్‌ లో ఉంటుంది.ఆమెకు ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నటుడు శ్రీకాంత్‌ కుమారుడు కలిసి తీసిన చిత్రం పెళ్లి సందడి లో ఆమె ముఖ్య పాత్ర పోషించారు.

ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వితికా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఆమె ఛానెల్‌ లో తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్‌ కొంచెం కంగారు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వితికా స్పాండిలైటిస్‌, మైగ్రేన్‌ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

మైగ్రేన్‌ రావడం వల్ల విపరీతమైన తలనొప్పి, వెన్నుపోటు వస్తున్నాయని..దాని వల్ల ఏ పనీ కూడా చేయలేకపోతున్నట్లు వితికా పేర్కొంది. స్పాండిలైటిస్‌ కు ఫిజియోథెరపీ తీసుకుంటున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల క్రితమే నీడ్లింగ్‌ చేయించుకున్నట్లు వివరించింది. దాని వల్ల కాస్త ఉపశమనం రావడంతో ప్రస్తుతం తన పనులు తాను చేసుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

అయితే 15 రోజుల నుంచి మైగ్రేన్ బాగా ఇబ్బంది పెడుతుందని..ఈ రెండింటి వల్ల చాలా బాధపడుతున్నాని వితికా చెప్పింది. వితికా అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

Also read: ప్రిన్సిపల్ నుంచి టీసీలు తీసుకునే ఇద్దరు పోరంబోకులు..ప్రెసిడెంట్‌ నుంచి మెడల్‌!

#tollywood #vithika-sheru #varun-sandesh #health-issues
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe