Vitamin Deficiency: విటమిన్‌ -బీ12 లోపంతో వచ్చే సమస్యలేంటి?

విటమిన్‌- బీ12 లోపం ఉంటే మన శరీరంలో నాడి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చ‌ర్మం కూడా ప‌సుపు రంగుగా మారుతుంది. మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండదు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, గుడ్లలో ఈ విటమిన్‌ సంవృద్ధిగా ఉంటుంది.

Vitamin Deficiency:  విటమిన్‌ -బీ12 లోపంతో వచ్చే సమస్యలేంటి?
New Update

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు అవసరం. మినరల్స్‌, ప్రొటీన్ల ఆధారంగానే శరీరం పనిచేస్తూ ఉంటుంది. విటమిన్‌ బీ12 అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యం. చాలా మంది కేవలం మాంసాహారంలోనే విటమిన్‌ బీ12 ఉంటుందని అనుకుంటారు. కానీ.. మాంసం తినకపోయినా ఈ విటమిన్‌ను పొందవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్లతో మన శరీరం ఎన్నో విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. చిన్న విట‌మిన్ లోపంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులోనూ విటమిన్‌ బీ12 లోపంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే ఈ విటమిన్‌ ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విట‌మిన్ బి12ను కోబాల‌మైన్ అని పిలుస్తారు. ఇది మన మెద‌డు ప‌నితీరును ఎంతో మెరుగుపరుస్తుంది. బీ12 వల్ల ఎర్ర ర‌క్త క‌ణాలు బాగా వృద్ధి చెందుతాయి.

అంతేకాకుండా.. డీఎన్ఏ కూడా క్రమ‌బ‌ద్ధీకరించబడుతుంది. బి12 లోపం వస్తే మన శరీరంలో నాడి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా విట‌మిన్ బి12 అనేది మన శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విట‌మిన్ బీ12 లోపంతో ఒక్కసారిగా బ‌రువును కోల్పోవడం జరుగుతుంది. అలాగే కండ‌రాలు సైతం బలహీనంగా మారతాయి. చ‌ర్మం కూడా ప‌సుపు రంగుగా అవుతుంది. నాడీ వ్యవస్థకూడా బాగా నష్టపోతుంది. అందుకే బీ12 లోపం తలెత్తకుండా జాగ్రత్తపడాలి. 18 ఏళ్లు దాటినవారి ప్రతిరోజు 25.4 మైక్రోగ్రాముల విట‌మిన్ బి12 అవసరం.

మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండదు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, గుడ్లలో ఈ విటమిన్‌ సంవృద్ధిగా ఉంటుంది. శాకాహారుల్లో ఎక్కువగా బీ12లోపం కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని రకాల శాఖాహారాల్లో కూడా బీ12 విటమిన్‌ ఉంటుందని నిపుణులు అంటున్నారు. పాలు, పెరుగు, బాదం, చీజ్‌, జీడిప‌ప్పు, ఓట్స్‌, కొబ్బరిపాలతో పాటు పన్నీరులో ఈ విటమిన్‌ ఉంటుంది. విట‌మిన్ బీ12 లోపం ఉన్నవారు మద్యం తాగొద్దని, ఒకవేళ తాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పసిపిల్లల్లా మారం చేస్తున్న మేక పిల్లలు.. వీడియోకి నెటిజన్ల ఫిదా

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నిరివాణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

WATCH:

#health-tips #life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe