Vishwak Sen : ఇండియాలో అందరికంటే గొప్ప నటుడు ఆయనే.. స్టార్ హీరోపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు?

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ లో మీ లైఫ్ లో ఎన్టీఆర్ ప్రభావం ఎంత ఉంది? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విశ్వక్ రెస్పాండ్ అవుతూ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

New Update
Vishwak Sen : ఇండియాలో అందరికంటే గొప్ప నటుడు ఆయనే.. స్టార్ హీరోపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు?

Vishwak Sen About Jr NTR : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ని శనివారం రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. మీ లైఫ్ లో ఎన్టీఆర్ ప్రభావం ఎంత ఉంది? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విశ్వక్ రెస్పాండ్ అయ్యాడు.

publive-image

ఇండియాలోనే అందరి కంటే గొప్ప నటుడు ఎన్టీఆర్

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.." నా దృష్టిలో దేశంలోనే అందరికంటే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రభావం అంటే ఆయనంత గప్ప నటుడ్ని కావాలని ఉంటుంది. అందరూ ఆయన్ని స్టార్ అంటారు. కానీ నాకు తెలిసి ఇండియాలోనే అందరి కంటే గొప్ప నటుడు ఆయనే.దానికి నేను ఫ్యాన్. ఒక స్టార్ కంటే నాకు ఆయన గొప్ప నటుడు" అని అన్నాడు. కాగా ఎన్టీఆర్ తో విశ్వక్ సేన్ కి ఎలాంటి బాండింగ్ ఉందో తెలిసిందే. విశ్వక్ ఇప్పటికే ఎన్టీఆర్ ని పలుమార్లు కలిసాడు. రీసెంట్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీని వీళ్లిద్దరూ సిద్ధుతో కలిసి చూశారు. ఆ సినిమా సస్సెస్ మీట్ కి సైతం హాజరయ్యారు.

Vishwak Sen About Jr NTR

మే 13 న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 13 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఫార్చూన్ ఫోర్, సితార ఎంటర్టైనెంట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Vishwak Sen About Jr NTR

Also Read : ‘జాతి రత్నాలు 2 అప్పుడే’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హీరోయిన్

Advertisment
తాజా కథనాలు